వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెలరేగిపోయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నానీ. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యా రు.
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ.. నిప్పులు చెరిగిన కొడాలి నాని.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. నోరు విప్పితే ఎంత మాట పడితే అంత మాట అనేయడం.. వెనుకా ముందు కూడా ఆలోచించకుండా.. ఆడు-ఈడు అంటూ నోరు చేసుకోవడం కొడాలికే చెల్లింది. అప్పట్లోనే ఆయనపై సామాజిక వాదులు కూడా అసహ్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి వైసీపీ ఓటమికి ఇలాంటి వారు కూడా కారకులు అయ్యారు.
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దూషణలు, బూతులకు దిగి మహిళలను, రాజకీయ నాయకులను కించపరిచేలా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడాలి నానీపై.. విశాఖలో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని అంజన ప్రియ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. విశాఖ పోలీసులు కేసు పెట్టారు. దీనికి సంబంధించి త్వరలోనే 41ఏ కింద నోటీసులు ఇవ్వనున్నట్టు సీఐ తెలిపారు.
ఏంటీ కేసు..
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై బండ బూతులతో విరుచుకుపడ్డారని, సోషల్ మీడియాలోనూ ఇలాంటి కామెంట్లే చేశారని.. అంజన ప్రియ పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలను ఆమె అందించారు. దీంతో కొడాలిపై కేసు నమోదు చేశారు. కాగా, కూటమి ప్రభుత్వ హయాంలో కొడాలిపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
This post was last modified on November 18, 2024 4:31 pm
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…