ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు చక్కగా అమలు కావాల్సిందే. ఇప్పుడు అదే ఫార్ములాను శాసన మండలిలోనూ ప్రయోగిస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీకి అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో బాగానే ఉంది. దీంతో ఏ సమావేశాలు జరిగిన శాసన సభకు రాని సభ్యులు.. మండలికి మాత్రం ఠంచనుగా వస్తున్నారు.
ఈ క్రమంలోనే కూటమి సర్కారుకు ఎదురు ప్రశ్నలు సంధిస్తూ.. ఇరుకున పెట్టే ఆలోచన చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను కూడా వైసీపీ అధినేత జగన్ సీరియస్‌గా తీసుకున్నా.. సభకు మాత్రం వెళ్లకుండా మండలికి మాత్రం ప్రతి సభ్యుడిని హాజరయ్యేలా చూస్తున్నారు. దీంతో శాసన సభలో ఏకపక్షంగా సాగుతున్న కార్యక్రమాలు.. మండలి విషయానికి వస్తే మాత్రం ఉత్కంఠగా మారుతున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీలకు, కూటమి పార్టీల సభ్యులకు మధ్య వాగ్యుద్ధం సహా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. కూటమి పార్టీలకు వైసీపీకి ఉన్నంత బలం లేకపోవడంతో మండలిలో వైసీపీదే పైచేయి అవుతుందని అందరూ అనుకున్నారు. గతంలోనూ వైసీపీ హయాంలో ఇలానే జరిగింది. మండలిలో ఆ పార్టీకి బలం లేకపోవడం.. అప్పటిటీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండడంతో వైసీపీకి ఇబ్బందులు వచ్చాయి. కానీ, ఇప్పుడు చంద్రబాబుఐడియాతో కూటమి పార్టీలకు మండలి కూడా బలంగా మారింది.
ప్రస్తుతం మండలిలో కూటమి పార్టీలకు సంఖ్యా బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రులను మండలికి పంపిస్తున్నారు. వీరికి అటు శాసనసభలోనూ.. ఇటు మండలిలోనూ ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు మంత్రులు మొత్తాన్ని మండలికి పంపిస్తున్నారు.
అంటే.. ఉన్న మంత్రులు 25 మంది దాదాపు 13 నుంచి 15 మంది వరకు మండలికే వస్తున్నారు. దీంతో వైసీపీ దూకుడు పెద్దగా కనిపించకపోగా.. అడుగడుగునా వారిని మంత్రులు అడ్డుకుంటున్నారు. దీంతో వైసీపీ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నా.. అది సాధ్యం కావడంలేదు. ఈ పరిణామాలతో చంద్రబాబు ఐడియా సక్సెస్ అయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 18, 2024 3:57 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…