ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం కేసులు నమోదయ్యాయి. రెండు కేసులూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు కేసు నమోదు చేయగా, మరొకరు.. నేరుగా మీడియా ముందు గతంలో చేసిన వ్యాక్యలపై కేసు నమోదైంది. దీంతో వైసీపీలో అలజడి మరింత పెరిగింది.
ఎవరు వారు?
వైసీపీ నేత, యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఆయనకు వాట్సాప్ ద్వారా 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, చంద్రశేఖర్ స్పందించలేదు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేరుగా ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేశామని చెబుతూ.. 41 ఏ కింద నోటీసులను ఆయనకే ఇచ్చారు. గతంలో టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పై తాటిపర్తి సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడారని టీడీపీ నాయకుడు ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన పోలీసులు చంద్రశేఖర్‌పై కేసు పెట్టారు.
ఇక, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌పైనా కేసు నమోదైంది. సోమవారం జనసేన పార్టీకి చెందిన కీలక నాయకుడు పోలీసులను ఆశ్రయించారు. గత ఎన్నికలకు ముందు తమ పార్టీ అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ నోరు చేసుకున్నారని, వినలేని మాటలు మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on November 18, 2024 1:41 pm
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…