టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఏదో ఒక కేసులో చింతమనేనిని అరెస్టు చేయడం, స్టేషన్ కు తీసుకువెళ్లి విచారణ చేయడం నిత్యకృత్యమైందని విమర్శలు వచ్చాయి. అయితే, చింతమనేనిని వేధించిన అధికారులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలక పోస్టులు ఇచ్చిందని స్వయంగా చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే అధికారుల తీరుపై, తమ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో తనపై వేధింపులకు పాల్పడిన అధికారులకు మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, అలా పోస్టింగులు ఇప్పిస్తోంది కూడా తమ పార్టీకి చెందిన నాయకులేనింటూ దెందులూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో చిట్ చాట్ సందర్భంగా దెందులూరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
తనపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని, అయితే తనను వేధించిన అధికారులు ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తనపై 27 అక్రమ కేసులు పెట్టిందని, వాటిలో రెండింటిని కోర్టు కొట్టివేసిందని గుర్తు చెప్పారు. తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసుల్లో ఎస్సీలు కూడా బాధితులుగా ఉన్నారని చింతమనేని చెప్పారు. మరి, సొంత ప్రభుత్వంపై, తమ పార్టీ నాయకులపై చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 16, 2024 9:59 pm
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…