మహారాష్ట్ర డెగ్లూరులో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకట్టుకునే ప్రసంగంతో దుమ్ము రేపారు. మరాఠీలో ప్రసంగించి మరాఠా ప్రజల హృదయాలను గెలుచుకున్న పవన్ కల్యాణ్, తాను ఓట్లు అడిగేందుకు రాలేదని, మహారాష్ట్ర వీరులకు నివాళి అర్పించేందుకు వచ్చానని స్పష్టం చేశారు.
పవన్ ప్రసంగం “జై భవానీ, జై శివాజీ” అంటూ మొదలైంది. ‘‘ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి. స్వాతంత్ర్య పోరాటం స్ఫూర్తిగా నిలిచిన గడ్డ. ఇక్కడికి రావడం గౌరవంగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మహారాష్ట్రలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం, ఆలయ అభివృద్ధి, పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇది కొనసాగడానికి ఎన్డీయే విజయం కీలకమని తెలిపారు.
పవన్ తన ప్రసంగంలో సనాతన ధర్మంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘‘సినిమాల్లో యాక్షన్ సులువు. కానీ ధర్మ పోరాటం నిజ జీవితంలో అత్యంత క్లిష్టం. మనం సనాతన ధర్మం కోసం నిలబడాలి. ఎవరు తల్వార్ పట్టుకుని వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి’’ అని పవన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, పవన్ కల్యాణ్‌ను ‘‘ఆంధీ కల్యాణ్’’ అని అభివర్ణించారు. ప్రధాని మోదీ కూడా ఇదే ప్రస్తావన చేసినట్లు గుర్తుచేశారు. ఇది పవన్ ప్రసంగానికి విశేష ఆకర్షణను తెచ్చిపెట్టింది.
ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ‘‘పవన్ కల్యాణ్ ఆలోచన ఏపీలో 175 సీట్లలో 164 సీట్లు గెలిపించేందుకు ప్రేరణగా నిలిచింది’’ అని కొనియాడారు. మహారాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న పవన్, డెగ్లూరులో ఎన్డీయే విజయానికి మద్దతు పునరుద్ఘాటించారు.
This post was last modified on November 16, 2024 4:25 pm
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…