రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు.. విధ్వంసమైన రాష్ట్రాన్ని, వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇటుక ఇటుక పేర్చి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. అయితే.. కష్టాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవని చెప్పారు.
ఈ ప్రభుత్వంపై అనేక ఆకాంక్షలు పెట్టుకున్నవారు ఉన్నారు. అటు ప్రజలు, ఇటు పార్టీల కార్యకర్తలు, మరోవైపు ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం అద్భుతాలు చేస్తుందని ఆశలు పెట్టుకున్నారు. వారికి ఆకాంక్షలు కూడా బాగానే ఉన్నాయి. దీనిని నేను కాదనడం లేదు. ఎన్నికల వేళ ఉద్యోగులు, ప్రజలు కార్యకర్తలు కూడా కూటమికి అనుకూలంగా పనిచేశారు. అందుకే వారంతా ఆకాంక్షలు పెట్టుకున్నారు. చాలా చేయాలనే ఉంది. కానీ, వైసీపీ విధ్వంసం కారణంగా రాష్ట్రం వెంటిలేటర్ పై కి ఎక్కింది. అందుకే ఏం చేయాలన్నా.. కాళ్లు చేతులు ఆడని పరిస్థితి ఏర్పడింది
అని చంద్రబాబు చెప్పారు.
ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేసేందు కు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్నింటిని అమలు చేయడం ప్రారంభించామని, మరికొన్నింటిని త్వరలోనే పట్టాలెక్కిస్తామన్నారు. ఊహించని దానికన్నా ఎక్కువగా రాష్ట్రం నష్టపోయిందన్నారు. ప్రస్తు తం అప్పుల పుట్టే పరిస్థితి కూడా లేదన్న చంద్రబాబు.. సంపద సృష్టి దిశగా అడుగులు పడుతున్నాయ ని తెలిపారు. సంపద సృష్టిస్తామని, దానిని ప్రజలకు పంచుతామని చెప్పామని.. ఈ మాటకు తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.
This post was last modified on November 15, 2024 4:32 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…