అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తా వించారు. వైసీపీ నాయకులు కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, వారంతా సోషల్ మీడియాలో రెచ్చిపో యారని తెలిపారు.
అందుకే పోలీసులు వారిని అరెస్టు చేశారని చంద్రబాబు చెప్పారు. అయితే.. కేవలం వైసీపీ నేతలకే కాద ని.. మహిళలను, ఇంట్లో వాళ్లను అవమానించేలా.. వారు నొచ్చుకునేలా ఎవరూ కామెంట్లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తాను పారదర్శకంగా ఉంటానని తెలిపారు. కూటమి నాయకుల ను కూడా ఉపేక్షించేది లేదన్నారు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.
అందరికీ ఒకే రకంగా ట్రీట్‌మెంట్ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. కానీ, వైసీపీ హయాంలో ప్రతిపక్షాల కు చెందిన నాయకుల ఇళ్ల లోని ఆడవారిపై పోస్టులు పెడితే.. ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉందన్నారు. కాబట్టి.. ఇప్పుడు కూడా అలానే ఉంటాయని భావిస్తున్నారని కానీ, తాము ఊరుకునేది లేదన్నారు. ప్రతి విషయాన్ని పారదర్శకంగా తీసుకుంటామని.. ఈ విషయాన్ని కూటమి నాయకులు కూడా గుర్తించాలని సూచించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని కోరారు.
This post was last modified on November 15, 2024 4:26 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…