కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. భావప్రకటనా స్వేచ్ఛకు ఉరి వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అమాయకులను తీసుకువెళ్లి పోలీసు స్టేషన్లలో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కూడా వాపోయారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆయన విజ్ఞుడైన పద్మనాభం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.
తాను నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయాలని అనుకుంటే.. వైసీపీ హయాంలో జరిగిన మారణహోమం గురించి కూడా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. అంతేకాదు.. అప్పట్లో జరిగినవన్నీ బాగున్నాయ న్నట్టుగా ఆయన తీర్మానం చేయడం ద్వారా ఆయన తన పరువును తానే తీసుకుంటున్నట్టుగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డాక్టర్ సుధాకర్‌ను నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై ఆనాడు.. పెడ రెక్కలు విరిచి కట్టి మరీ స్టేషన్‌కు తరలించినప్పుడు ముద్ర గడ ఏమయ్యారు? అనేది వారు సంధిస్తున్న ప్రశ్న.
అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేశారన్న కారణంగా 80 ఏళ్ల వృద్ధుల నుంచి 20 ఏళ్ల యువకుల వరకు వైసీపీ పాలనలో అర్ధరాత్రి వేళ అరెస్టులు చేసినప్పుడు ముద్రగడ ఎందుకు మాట్లాడ లేక పోయారని కూడా అడుగుతున్నారు. అప్పట్లో మౌనంగా ఉంది.. సమర్థించిన ముద్రగడకు.. ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి లేదని చెబుతున్నారు. గతంలో తన కుటుంబాన్ని కూడా.. ఇలానే సోషల్ మీడియాలో ఆడిపోసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ.. ఇప్పుడు మాత్రం సమర్థించడం దారుణంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి సమాజంలో అంతో ఇంతో ప్రభావం ఉన్న ముద్రగడ వంటివారు.. రెండు పక్షాల తరఫున మాట్లాడి తే బాగుంటుందన్నది పరిశీలకులు చెబుతున్న మాట. అలా కాకుండా.. ఒకవైపే చూస్తామంటే.. ఎలా? అనేది కూడా వారు సంధిస్తున్న మరో ప్రశ్న. పరువు పోగొట్టుకోవడం తప్ప.. ముద్రగడకు మరో ప్రయో జనం ఉండదని.. ఇప్పటికే పేరు మార్పు.. కుమార్తె పార్టీ మార్పుతో సగం పరువు పోయిన ముద్రగడ.. కాపుల్లోనూ పలుచన అయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
This post was last modified on November 15, 2024 2:14 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…