Political News

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు వాడున్నారని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులలో చాలామంది కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుల విధులపై విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను బాత్రూమ్ ల నిర్వహణ వంటి విధులు అప్పగించిందని లోకేష్ అన్నారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో చర్చలకు తలుపులు మూసేయడం లేదని, ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించారరి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్ని తొలగిస్తామని ఆయన ప్రకటించారు.

ఇక, మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై లోకేష్‌ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ మొదలైందని, ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయాంలోనే నిర్వహించామని చెప్పారు. 1994-2019 వరకు మొత్తం 2.20లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80 లక్షల పోస్టులు టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసిందని వెల్లడించారు.

2024 ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీచర్ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. డిఎస్సీపై లీగల్‌ ఒపినియన్‌ అడిగామని, కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, ఆ తర్వాత పకడ్బందీగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.

This post was last modified on November 15, 2024 2:13 pm

Share

Recent Posts

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

16 minutes ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

1 hour ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

2 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

3 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

4 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

5 hours ago