Political News

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మ‌య్యారు. త‌ర్వాత‌.. ఆయ న‌పై వైసీపీ వేటు వేసినా.. మ‌ళ్లీ పార్టీలోకి తీసుకుంది. ఇక‌, ఆత‌ర్వాత ఏపీ ఫైర్ నెట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కూడా పూనూరు ప‌నిచేశారు. ఇప్పుడు తాజాగా ఆయ‌న ప‌రారీలో ఉండ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ, ముత్యాలంపాడులో ఒక పెద్ద కార్యాల‌యాన్ని పూనూరు గౌతంరెడ్డి నిర్వ‌హిస్తున్నారు. అయితే వాస్త‌వానికి ఈ ఆఫీసు ఉన్న‌ భూమి గౌతంరెడ్డిది కాద‌ని.. తప్పుడు పత్రాలతో ఆక్రమించార‌నేది పూనూరుపై ఉన్న ప్ర‌ధాన అభియోగం. ఈ క్ర‌మంలో ఈ భూమి ఓన‌ర్ అయిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి ప్ర‌స్తుతం న్యాయ పోరాటం చేస్తున్నారు. కేసు విచార‌ణ ప‌రిధిలో ఉంది. అయితే.. ఇంత‌లోనే గౌతంరెడ్డి ఉమామ‌హేశ్వ‌రశాస్త్రిని చంపించేందుకు కుట్ర ప‌న్నార‌నేది తాజాగా న‌మోదైన కేసు.

ఈ క్ర‌మంలో స్థల యజమాని గండూరి ఉమామహేశ్వరశాస్త్రిపై ఇటీవల దాడి కూడా జ‌రిగిన విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ దాడి వెనుక పూనూరు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. గండూరిని లేపేయ‌డం ద్వారా రూ.కోట్లు విలువ చేసే స్థిరాస్థిని సొంతం చేసుకునేందుకు పూనూరు ప్లాన్ చేశార‌న్న అభియోగం కూడా న‌మోదైంది. గండూరి హ‌త్య‌కు సుమారు రూ.25 లక్షల సుపారీకి డీల్ కుదుర్చుకున్నార‌ని పోలీసులు గుర్తించారు.

ఇదిలావుంటే.. ఆది నుంచి వివాదాల‌కుకేంద్రంగా ఉన్న గౌతంరెడ్డిపై చాలానే కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రారీలో ఉన్నాడు. తాజాగా న‌మోదు చేసిన‌ ఎఫ్ఐఆర్‌లో ఆరుగురు నిందితుల పేర్లను చేర్చారు. గండూరి హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించిన వారిలో ఏ1గా పూనూరు గౌతంరెడ్డి పేరు చేర్చారు. ఇదిలావుంటే.. గౌతంరెడ్డిని వైసీపీ నాయ‌కులే కాపాడుతున్న‌ట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం పూనూరు.. కడపలో గానీ, నెల్లూరులో గానీ ఉండొచ్చ‌ని చెబుతున్నారు. గౌతం రెడ్డిని అరెస్టు చేసేందుకు వేట సాగిస్తున్నారు.

This post was last modified on November 15, 2024 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

59 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago