ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఏపీ రాజధాని అమరావతితోపాటు రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ నెల 29న ఏపీలో పర్యటించబోతున్నారు. విశాఖలో రూ 80 వేల కోట్ల పెట్టబడులతో స్థాపించబోతోన్న ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్’’ కు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లతోపాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం 1200 ఎకరాలు భూమిని ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో 20 గిగావాట్‌ల విద్యుత్ ను ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఏపీ, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన తర్వాత ప్రధాని మోదీ ఏపీలో తొలిసారి పర్యటిస్తున్నారు. అదీగాక, అనధికారిక ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న విశాఖలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు. మరోవైపు, విశాఖకు రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఉన్నాయి. దీంతో, కూటమి నేతలు ఈ టూర్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
This post was last modified on November 15, 2024 1:38 pm
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరో గురించి మాట్లాడితే అభిమానుల్లో అమితాసక్తి కలుగుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…