తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, జగన్ అండ్ కో అసెంబ్లీకి రాకుంటే రాజీనామాలు చేయాలని టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తొలిసారిగా స్పందించారు.
తన ప్రతిపక్ష హోదా తీస్తానని ఇదే సభలో అహంకారంతో విర్రవీగిన వారికి ప్రజలు కాల్చి వాత పెట్టి 11 సీట్లు ఇచ్చారని, అటువంటి వారికి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
10 శాతం సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని, అది ఏ నాయకుడో, ఇంకొకరో ఇచ్చేది కాదని అన్నారు. ప్రతిపక్ష హోదా లేదంటే సభకు రానని చెప్పడం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఒక వ్యక్తి ఆలోచనా విధానం, డిక్టేట్ చేయడం, శాసించడం ప్రజాస్వామ్యంలో ఉండకూడదని చెప్పారు.
ప్రజలు చైతన్యంతో గెలిపించిన ప్రజా ప్రభుత్వం ఇదని, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం అని చెప్పారు. 2019-24 వరకు ఒక్క రోజు కూడా సభ సజావుగా సాగలేదుదని, 2024-29 మధ్య జరిగే ఈ సభ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను సాధించడానికి దోహద పడుతుందని చెప్పారు. ఐదేళ్లలో 227 ఎంవోయూలు జరిగినా ఏపీకి పైసా పెట్టుబడి రాలేదని జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పన్నులు, కరెంటు చార్జీలు పెంచడంతో పరిశ్రమలు ఏపీలో మనుగడ సాధించలేని పరిస్థితిని జగన్ తెచ్చారని విమర్శించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు.
ప్రతి నలుగురు ఐటీ నిపుణులు ఒకరు తెలుగువారు ఉన్నారంటే 1995 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమని చంద్రబాబు చెప్పారు 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ దేశంగా తయారవుతుందని, ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు.
This post was last modified on November 15, 2024 6:46 am
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి చికిలి గాలి…