500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కి కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా లెక్కచేయకుండా అత్యంత ఖరీదైన భవనం కట్టిన జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
500 కోట్లు పెట్టి జగన్ తన రాజకీయ సమాధి కట్టుకున్నారని, ఆ ప్యాలెస్ కట్టి ఓ విధంగా జగన్ మనకు మంచే చేశారని రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నెగిటివిటిలో కూడా పాజిటివిటీ వెతుక్కోవాలని, ఆ ప్యాలెస్ కట్టడంతోనే జగన్ పతనం ప్రారంభమైందని రఘురామ అన్నారు. ఆ ప్యాలెస్ కట్టి జగన్ అల్లరిపాలైనా సరే రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశారని రఘురామ చెప్పారు.
రుషికొండ భవనంపై తాను హైకోర్టును ఆశ్రయించానని, అయితే తనపై సుప్రీంకోర్టుకు కూడా అబద్ధం చెప్పారని రఘురామ అన్నారు. టూరిజం ప్రాజెక్టు అని చెప్పి ఆ తర్వాత సీఎం నివాసం అని చెప్పారని అబద్ధాలు ఆడారని రఘురామ గుర్తు చేసుకున్నారు. రుషికొండను మంచి భవనంగా తీర్చిదిద్దాలని, నియంత కట్టుకున్న విలాస భవనం అని ప్రజలకు తెలియాలని చెప్పారు. నిర్ణీత రుసుము వసూలు చేసి ప్రజలను సందర్శనార్థం ఆ ప్యాలెస్ లోకి అనుమతించాలని రఘురామ కోరారు. ఆ రకంగా అయినా వృధా అయిన ప్రజాధనం కొంతవరకు రికవరీ అవుతుందని చెప్పుకొచ్చారు.
ఇక, ఇదే రుషికొండ ప్యాలెస్ పై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భవనంలో 11 లక్షల రూపాయల ఖరీదు చేసే కమోడ్, 31 లక్షల రూపాయల ఖరీదు చేసే తలుపులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే అని అన్నారు. ఇక్కడ దుర్వినియోగం అయిన ప్రజాధనం గురించి ఆలోచిస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండపై జరిగిన అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో పెట్టినా తప్పు లేదని, పర్యాటక శాఖ భవనాల ముసుగులో ఈ ప్యాలెస్ కట్టి అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి జగన్ తెరతీశారని ఆయన ఆరోపించారు.
This post was last modified on November 15, 2024 6:47 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…