ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రఘురామకృష్ణరాజుపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భయం అనేది ఆర్ఆర్ఆర్ బయోడేటాలో లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎంతోమంది యువ శాసనసభ్యులకు రఘురామ ఆదర్శమని, సభలో ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరిగేందుకు ఆయన సహకారం ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆర్ఆర్ఆర్ అంటే రియల్, రెస్పాన్సిబిల్, రెబెలియస్ అని చెప్పారు.
మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్లు బయటకు చెబుతారు కాబట్టి రియల్ అని, తప్పుని తప్పు అని చెప్పే భోలా శంకరుడు రఘురామ అని లోకేష్ చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తనకు ఆయన అండగా నిలబడ్డారని, ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తున్నప్పుడు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర, రఘురామ తనకు ఎంతో సహకరించి చర్చించే వాళ్ళని చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను ముందుగా గ్రహించింది రఘురామా అని, అప్పులు ఇస్తే రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుందని పోరాడిన వ్యక్తి ఆయనే అని గుర్తు చేశారు. ఉండి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సొంత నిధులు, సి ఎస్ ఆర్ నిధులు తెచ్చి పార్కులు అభివృద్ధి చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేస్తున్నారని అన్నారు. రచ్చబండ పెట్టి గత ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారని అర్ధరాత్రి అరెస్టు చేయించారని, కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారని గుర్తు చేసుకున్నారు.
ఒక ఎంపీని కస్టడీలో టార్చర్ చేస్తారా అని తాను టీవీలో స్క్రోలింగ్ చూసి అనుకున్నానని, ఆ తర్వాత దెబ్బతిన్న రఘురామ కాళ్ళ ఫోటోలు వాట్సప్లో తనకు వచ్చాయని గుర్తు చేసుకున్నారు. సొంత పార్టీ ఎంపీని ఈ రకంగా టార్చర్ చేస్తారా అని ఆశ్చర్యపోయానని, ఆ రోజు నుంచి కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నానని లోకేష్ అన్నారు.
తనపై కూడా కేసులు పెట్టి రాళ్ల దాడి చేశారని, సోడా బాటిల్స్ విసిరారని, అటెంప్ట్ టు మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ లేదని, ఎందుకు రావడం లేదో వారి విజ్ఞతకే వదిలేద్దామని లోకేష్ అన్నారు. సభలో మంచి డిబేట్ జరగడానికి రఘురామ సహకారం ఉండాలని కోరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టి రఘురామ నోరు కట్టేశారన్న బాధ ఉందని లోకేష్ అన్నారు.
This post was last modified on November 15, 2024 6:43 am
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…