Political News

38 శాతం ఓట్ షేర్ కూడా పోయేలా ఉంది జగన్!

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. శాసన సభకు వెళ్లని జగన్, వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెహ్రూ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల తాజాగా మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఉందని, ఆ పార్టీ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ప్రజలు వైసీపీని ఓడించాలని కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని, ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ వైసీపీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 1.7 శాతం ఓటు షేర్ అని జగన్ విమర్శించారని, అయితే, వైసీపీకి 38 శాతం ఓట్లు ఉన్నా అసెంబ్లీకి వెళ్లడం లేదని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా..వైసీపీకి 11 సీట్లు వచ్చినా రెండూ ఒక్కటే అని ఎద్దేవా చేశారు. తమకు సీట్లు రాలేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్లలేదని, వైసీపీని నమ్మి 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినా ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లడం లేదని విమర్శించారు.

బడ్జెట్ పై అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారని , ఆయన కంటే ముందు తాము కూడా అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ బాగోలేదని చెప్పామని అన్నారు. మరి జగన్ కు తనకు తేడా ఏంటని, వైసీపీకి కాంగ్రెస్ కు తేడా ఏంటని ప్రశ్నించారు. 38 శాతం ఓట్ల షేర్ ఉందని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ, జగన్ తీరు చూస్తే ఆ ఓటు బ్యాంకు కూడా మిగుల్చుకునేటట్లు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ లేని, ప్రజా సంక్షేమం పట్టించుకోని వైసీపీదే ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ అని, కాంగ్రెస్ ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ కాదని చురకలంటించారు.

శాసన సభకు వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయాలని వైసీపీ సభ్యులకు మళ్లీ చెబుతున్నానని షర్మిల అన్నారు. రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, తమను గెలిపించినా సరే అసెంబ్లీకి వెళ్లబోమని ప్రజలకు రెఫరెండం ఇచ్చి గెలవాలని షర్మిల డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లబోమన్న వైసీపీ సభ్యుల తీరు మూర్ఘత్వంగా ఉందని విమర్శించారు.

This post was last modified on November 14, 2024 5:49 pm

Share

Recent Posts

పాతిక రోజుల్లో ఇరుముడి… ఏదీ సందడి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…

38 minutes ago

విజ‌య్ స‌రైన‌ సినిమా చేసుంటే…

త‌మిళ సినిమాల్లో నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉంటూ రాజ‌కీయాల వైపు అడుగులేసిన విజ‌య్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…

2 hours ago

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

2 hours ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

3 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

7 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

14 hours ago