మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. అయతే, గతంలో చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలేదని వైసీపీ సభ్యులు అన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహాంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఆనాడు అసెంబ్లీలో అవమానించారని, అందుకే, చంద్రబాబు ఆనాడు సభ నుంచి వెళ్లిపోయారని లోకేష్ గుర్తు చేశారు.
కౌరవ సభలో తనకు అవమానం జరిగిందని, మళ్లీ గౌరవ సభగా ఇది మారినప్పుడే అడుగు పెడతానని చంద్రబాబు అన్న మాటలను లోకేష్ గుర్తు చేశారు. శాసన సభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆ విషయం వైసీపీ సభ్యులు గుర్తు పెట్టుకోవాలని, ఈ రోజు కావాలని పోస్టులు కూడా అంతే పెడుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. అవన్నీ మీకు గుర్తుకు రావా అని వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు. మీరున్నారా ఆరోజు హౌస్ లో అని ప్రశ్నించారు. షర్మిల గారిని, విజయమ్మ గారిని, నా తల్లిని అవమానించారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వ్యాఖ్యలు గుర్తుపెట్టుకొని తాము అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదని, కానీ, తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని లోకేష్ అన్నారు. తాము ఏనాడూ అలా మాట్లాడలేదని, మాట్లాడబోమని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి ఏనాడూ తాము, తమ పార్టీ సభ్యులు మాట్లాడలేదని లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడారు. శాసన సభలో తన తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోవాలా అంటూ వైసీపీ సభ్యులపై లోకేష్ కన్నెర్రజేశారు. మునుపెన్నడూ లేని విధంగా వైసీపీ సభ్యులనుద్దేశించి లోకేష్ ఆవేశపూరితంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మండలిలో లోకేష్ విశ్వరూపం చూపించారని, వైసీపీ సభ్యులపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
This post was last modified on November 14, 2024 5:47 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…