Political News

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డి

వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న సంగతి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిిందే. ఈ క్రమంలోనే నటి, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డిపై కూడా కేసు నమోదైంది. నీచమైన భాషలో బూతులతో చంద్రబాబు మొదలు షర్మిల వరకు అందరిపై శ్రీరెడ్డి బూతుపురాణంతో విమర్శలు చేయడంతో ఆమెపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే తనను క్షమించి వదిలేయాంటూ మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ లకు రాసిన లేఖ వైరల్ గా మారింది.

జగన్, లోకేష్ లకు శ్రీరెడ్డి స్వయంగా రాసిన లేఖ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.లోకేష్ తో నేరు మాట్లాడి క్షమాపణలు కోరే స్థాయి తనకు లేక ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నానని అన్నారు. పది రోజులుగా తన కామెంట్ల గురించి అందరూ మాట్లాడుతున్నారని, అది చూసిన తర్వాత తాను ఇంతకాలం ఎంతమందిని బాధపెట్టానో తెలిసి వచ్చిందని పశ్చాత్తాప పడింది శ్రీరెడ్డి. గోదావరిలో పుట్టి విజయవాడలో పెరిగిన తనకు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే 95% స్నేహితులు అని, తన తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేశారని చెప్పింది.

తన సినీ, రాజకీయ జీవితం ముగిసిపోయిందని, వారం రోజులుగా తిండీ నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని చెప్పుకొచ్చింది. తనను శిక్షించినా, కొట్టినా ఆ గాయాలు కొన్నాళ్లకు మానతాయని, తన కుటుంబంలో పెళ్లి కావాల్సిన ముగ్గురు ఆడపిల్లలున్నారని చెప్పింది. వారి గురించి ఆలోచించి తనను క్షమించాలని, చాలా సంవత్సరాలకు సరిపడా క్షోభ తాము అనుభవించామని, ఇకపై తనను వదిలివేయాలని విజ్ఞప్తి చేసింది. లోకేష్ అన్నా ఇకపై ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని, తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని, తనను క్షమించాలని వేడుకుంది.

ఇక, వైైసీపీ సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, కానీ, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వచ్చి నష్టం జరిగిందని అంచనా వేయలేకపోయానని చెప్పింది. ఆ తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, భవిష్యత్తులో రాజకీయాల జోలికి రానని చెప్పింది. ఒకవేళ రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తాను టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిలలను విమర్శించబోనని, అలా చేస్తే తనకు ఏ శిక్ష విధించినా ఓకే అని చెప్పింది.

శ్రీరెడ్డి లేఖపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అడుసు తొక్కనేల..కాలు కడగనేల అంటూ ఏకిపారేస్తున్నారు. వైసీపీ నాయకుల అండ చూసుకొని పేట్రేగిపోయిన శ్రీరెడ్డి…ఇప్పుడు అరెస్టు భయంతో కాళ్లబేరానికి వచ్చిందని అంటున్నారు. కానీ, కర్మ ఎవరినీ వదలదని…చేసిన తప్పులకు ఆమె చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని చెబుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డికి శిక్ష తప్పదని అంటున్నారు.

This post was last modified on November 14, 2024 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

27 mins ago

మెగా బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్!

ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…

51 mins ago

ఏపీలో డ్రగ్స్ పై ‘ఈగల్’ ఐ

వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ…

1 hour ago

బ్లాక్ అండ్ బొల్డ్ లుక్ లో మైమరపించిన మాళవిక!

మాళవిక మోహనన్‌.. రీసెంట్ గా విడుదలైన తంగలన్ చిత్రంలో యాక్షన్ పాకుడు నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్న ఈ బ్యూటీ…

1 hour ago

నిన్న తమన్ – నేడు జేవి : ఏమైంది దేవీ..

పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్…

2 hours ago

‘పుష్ప-2’ షో పడిపోయింది : టాక్ ఏంటంటే….

దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’…

2 hours ago