రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా హైకోర్టులో చర్చకు వచ్చాయి. అయితే.. వైసీపీ హయాంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామని, వాటికి అనుగుణంగా మళ్లీ తాము రివర్స్ చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు సదరు కేసును నాలుగు నెలలకు వాయిదా వేసింది.
ఏంటీ చట్టం..
జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇది పెద్ద రగడకు దారి తీసింది. అయినప్పటికీ మొండిగానే అప్పటి వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే తమను ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొంటూ.. రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1) ఏపీ మానవహక్కుల కమిషన్, 2) ఏపీ లోకాయుక్త. ఈ రెండింటినీ.. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలోనే ఉంచాలని నిర్ణయించింది.
కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటిని కర్నూలుకు తరలించారు. హడావుడిగా వాటికి కార్యా లయాలను కూడా కేటాయించారు. అద్దె ప్రాతిపదికన కర్నూలులో మానవ హక్కులకమిషన్, లోకాయుక్త లకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కర్నూలును న్యాయరాజధాని చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే.. వీటిని సవాల్ చేస్తూ.. అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. అయితే.. సర్కారు మారడంతో ఇప్పుడు వాటిపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.
రాష్ట్ర రాజధానిని అమరావతిగానే గుర్తించినందున మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని, లోకాయు క్తలను కూడా.. అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే మరోసారి చట్టం చేయనున్నట్టు తెలిపింది. అంతేకాదు.. వైసీపీ హయాంలో చేసిన చట్టాన్ని రద్దు చేయనున్నట్టు కోర్టుకు వివరించింది. దీంతో ప్రస్తుత విచారణను వాయిదా వేయాలని కోరింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ విచారణను నాలుగు మాసాలకు వాయిదా వేసింది.
This post was last modified on November 13, 2024 8:45 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…