మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే బుధవారం(నవంబరు 20) జరగనుంది. అంటే.. ప్రచారానికి పట్టుమని 5 రోజులు మాత్రమే ఉంది. మొత్తం ఆరు రీజియన్లు, 36 జిల్లాలు, 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండడం ఒక చిత్రం. నిజానికి ఇక్కడ కూడా మావోయి స్టు ప్రభావిత.. విద్రోహ శక్తుల ప్రభావిత జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తోంది.
సరే.. ఇక, పార్టీల విషయానికి వస్తే.. అధికార పార్టీ కూటమి మహాయుతి(బీజేపీ+శివసేన(షిండే)+ ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం ఒవైపు, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(కాంగ్రెస్+ఎన్సీపీ+శివసేన(ఉద్దవ్) వర్గం మరో వైపు తలపడుతున్నాయి. మొత్తానికి పోరు మాత్రం భారీ స్థాయిలో ఉంది. ప్రదానంగా ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. తమ హవా కొనసాగించేందుకు బీజేపీ ఈ ఎన్నికలు కీలకంగా ఉండగా, హరియాణా, జమ్ము కశ్మీర్‌లో ఏర్పడిన పరాభవం నుంచి బయట పడేందుకు.. కాంగ్రెస్‌కు ఇవి అవసరం.
దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏడు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటిస్తే.. అనేక ఉచిత హామీలను(ఉచితాలకు వ్యతిరేకం అయినా) బీజేపీ కుమ్మరించింది. ఇదేసమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి నాయకులను రప్పించి ప్రచారాన్ని రెండు పార్టీలూ దంచికొడుతున్నాయి. నిజానికి అనా రోగ్య కారణంగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే సోనియా గాందీ కూడా.. ఈ సారి మహా ఎన్నికల్లో ప్రచార పగ్గాలు చేపట్టారు. ఇక, ప్రధాని ఏకంగా 22 రోజుల పాటు షెడ్యూల్ ఇచ్చారు.
వీరితోపాటు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉత్తరాది మంత్రులు, సీఎంలు కూడా ప్రచారంలో దూకుడుగా ఉన్నారు. అయితే.. ఏ కూటమి గెలుస్తుంది? అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. కానీ, ఈ విషయంపై ఎవరూ ఇతమిత్థంగా చెప్పలేక పోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ముందస్తు సర్వేలు.. మహా వికాస్ అఘాడీ వైపు మొగ్గు చూపాయి. కానీ, కొన్ని మాత్రం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి వైపే మొగ్గాయి. ఇక, ప్రజల నాడి ప్రాంతానికో రకంగా ఉంది. మొత్తంగా చూస్తే.. మహా యుద్ధంలో గెలుపు అనేది పార్టీలకు అంత ఈజీ అయితే కాదన్నది సుస్పష్టంగా తెలుస్తోంది.
This post was last modified on November 12, 2024 11:12 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…