వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆయన ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడాన్ని ఆమె నిశితంగా ప్రశ్నించారు. “అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది జగన్ తీరు” అని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు, అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందన్నారు.
తాజాగా ప్రారంభమైన బడ్జట్ సమావేశాలకు వెళ్లబోనని రెండు రోజుల కిందటే జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారమే ఆయన, ఆయన పరివారం కూడా సభలకు దూరంగా ఉన్నారు. కనీసం బడ్జెట్ సమావేశాల వైపు తొంగి చూడలేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని షర్మిల.. కామెంట్లు కుమ్మరించారు. “ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది” అని వ్యాఖ్యానించారు.
“ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పలుమార్లు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభాపక్షం మొత్తం రాజీనామాలు చేయండి” అని షర్మిల తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కాగా, వైసీపీ నుంచి ఒక్కరు కూడా.. సభలవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మరోవైపు.. సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో సభలో ప్రతిపక్ష సీట్లు ఖాళీగా కనిపించాయి. మరోవైపు.. పలువురు సభ్యులు ప్రతిపక్షం వచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యానించడం గమనార్హం. సభలో కూర్చున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రతిపక్ష నాయకుల సీట్ల వైపు పదే పదే చూడడం.. ఎవరైనా వస్తారేమో.. అన్న భావన కలగించింది. కానీ … సభకు ఎవరూ రాకపోవడం గమనార్హం.
This post was last modified on November 11, 2024 2:26 pm
థియేటర్ రిలీజ్ కావాల్సినంత బిల్డప్ ఉన్న సినిమా ఓటిటిలో వస్తే అంతకంటే ఫ్యాన్స్ కోరుకునేది ఏముంటుంది. అందులోనూ ఫైటర్ దర్శకుడు…
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు…
``ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు.…
మే 1 వచ్చేస్తోంది. అందరి చూపు నాని హిట్ 3 ది థర్డ్ కేస్ మీదే ఉంది. అంచనాలకు తగ్గట్టే…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు…
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. కొన్నేళ్లుగా ఆమె ఫిలిం కెరీర్ కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు.…