Political News

రాష్ట్రాన్ని ముంచేశారు: బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వైసీపీపై నిప్పులు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో మిగిలి ఉన్న ఐదు నెల‌ల కాలానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను సోమ‌వారం అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ ఈ బ‌డ్జెట్‌ను చ‌దివి వినిపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌త వైసీపీ స‌ర్కారు నిర్వాకాల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆదాయానికి, చేసిన అప్పుల‌కు పొంత‌న లేకుండా పోయింద‌న్నారు. ప‌రిమితికి మించి చేసిన అప్పులు కార‌ణంగా.. రాష్ట్రం ఇబ్బందుల్లో ప‌డింద‌న్నారు.

“ఏ ప్ర‌భుత్వానికైనా ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. కానీ,గ‌త ప్ర‌భుత్వం 25 సంవ‌త్స‌రాల‌కు స‌రిపోయేలా అప్పులు చేసింది. త‌ద్వారా.. ఆదాయాన్ని త‌గ్గిచేసింది. ఇది అత్యంత లోప భూయిష్ట విధానంగా నిపుణులు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించింది” అని పయ్యావుల త‌న ప్ర‌సంగం లో పేర్కొన్నారు. ఈ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకునేందుకు త‌మ‌కు స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు. అందుకే కొంత ఆల‌స్య‌మైనా ప‌రిపూర్ణ‌మైన బ‌డ్జెట్‌ను తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం ప్ర‌వేశ పెడుతున్న బ‌డ్జెట్‌.. రాష్ట్రాన్ని కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో ముందుకు తీసుకువెళ్ల‌నుంద‌ని మంత్రి ప‌య్యావుల తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను వండివార్చామ‌న్నారు. ప్రాధాన్య రంగాల‌తోపాటు ప్ర‌జ‌ల ఆరోగ్యం, స‌మాజ శాంతి భ‌ద్ర‌త‌లు, యువ‌త‌కు ఉపాధిక‌ల్ప‌న‌, ఉద్యోగాల‌కు పెద్ద పీట వేశామ‌ని అన్నారు. అదేవిధంగా రైతులేనిదే రాజ్యం లేద‌ని న‌మ్మే చంద్ర‌బాబు ఆశ‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌సాయానికి కూడా ఎక్కువ‌గానే నిధులు ఇచ్చామ‌న్నారు.

దీనికి ముందు..

బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డానికి ముందు.. ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా 2024-25(మిగిలిన కాలానికి) వార్షిక బడ్జెట్‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అనంతరం.. బ‌డ్జెట్ ప్ర‌తుల‌తో మంత్రి ప‌య్యావుల అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇదిలావుంటే.. అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే ముందు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

This post was last modified on November 11, 2024 2:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…

44 minutes ago

పడయప్ప… తెలుగులో కూడా రావాలప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…

1 hour ago

జగన్ చేసిన ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై అసలు దొంగ ఏమన్నాడో తెలుసా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…

2 hours ago

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

4 hours ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

6 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

7 hours ago