ప్రస్తుత సోషల్ మీడియా జమానాలో చిన్న చిన్న విషయాలే రచ్చరచ్చగా మారుతున్నాయి. కొన్ని విషయాలు అలాగే గుర్తింపు పరిష్కారం కూడా అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనగా ఐటీసీ కోహినూర్ దగ్గర కుమారీ ఆంటీ ఎపిసోడ్ ను పేర్కొనవచ్చు. సోషల్ మీడియా ద్వారా తక్కువ టైంలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ… అదే సోషల్ మీడియా వల్ల ఇబ్బందుల పాలు కూడా అయ్యారు. దీంతో ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని ఆమె దుకాణం తొలగించకుండా ఆదేశించారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిణామమే అదే కుమారీ ఆంటీ వల్లే కలిగింది.
ఐటీసీ కోహినూర్ సమీపంలో ఏర్పాటు చేసిన కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ లాగానే మరికొందరు కూడా అక్కడ రోడ్ సైడ్ ఉపాధి పొందుతున్నారు. అయితే, తాజాగా అక్కడ జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా వాటిని తొలగించారు. నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దీనిపై వారు ఆందోళన తెలిపారు. కుమారీ ఆంటీకి ఒక రూల్ తమకు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కుమారీ ఆంటీకి , ఆమెతో పాటు స్థానికంగా ఉండే వారు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పినట్లు గుర్తుకు చేశారు. కానీ ఇప్పుడు అధికారులు నిబంధనల పేరుతో తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
సైబరాబాద్‌లో అతి పెద్ద డిమాండ్ ఏరియాల్లో ఒకటైన మాదాపూర్‌లో ఇటు ఉపాధి పొందే కోణంలో అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అందుబాటు ధరల్లో ఫుడ్ పొందేలా పలు స్ట్రీట్ ఫుడ్స్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆకలి తీర్చేవిధంగానే కాకుండా ఐటీ పరిశ్రమపై ఆధారపడిన వారి అవసరాలు తీర్చేలా సైతం అనువైన ధరలను కలిగి ఉంటున్నాయి. దీంతో సహజంగానే వీటికి పెద్ద ఎత్తున ఆదరణ ఉంటోంది. అయితే, నిబంధనలకు విరుద్ధం అవడం, ట్రాఫిక్ సమస్యలకు కారణంగా మారుతుండటంతో… వీటిని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకుంటుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
This post was last modified on November 8, 2024 10:17 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…