అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా కొనసాగాయి. భారత సంతతికి చెందిన కమలా హరీస్ గెలవాలని చాలామంది ఇండియన్స్ కోరుకున్నారు. నిజానికి ఆమె గెలిస్తే ఒక చరిత్ర అయ్యేది.
ఇక అమెరికా రాజకీయాల్లో మన తెలుగు కనెక్షన్లు ఉండడం మరింత విశేషం. మొత్తానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆయన మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేడీ వాన్స్ కూడా ట్రంప్ విజయోత్సవ సభలో ప్రశంసలతో ముంచెత్తబడ్డారు. అందులో ముఖ్యంగా తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే, జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు కుటుంబానికి చెందిన మహిళ.
ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారు. ఆమె తల్లి శాంతమ్మ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు.
శాంతమ్మ గారి కుటుంబానికి తెలుగు సాహిత్యంలో గొప్ప పుణ్యస్తానం ఉంది. ఆమె భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రఖ్యాత పండితులుగా పేరొందారు. వారి కుటుంబం అమెరికాలో స్థిరపడినా, ఉషా తెలుగువారి బంధాన్ని ఆప్యాయంగా కొనసాగిస్తుందని శాంతమ్మ తెలిపారు. ఉష తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడినప్పటికీ, భారతీయ సంస్కృతి పట్ల ఆమెకు అభిమానం ఉందని శాంతమ్మ వెల్లడించారు.
ఇక ఉష భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్ష పదవికి నామినేట్ కావడంతో తెలుగింటి ఆళ్లుడి పేరు ఇప్పుడు అమెరికా రాజ్యంగ శ్రేణుల్లో ప్రస్తావన పొందుతోంది. అలాగే జేడీ వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా నియమించబడినప్పటి నుంచి ఉష పేరు విశాఖలో ప్రజల మదిలో మార్మోగుతోంది.
ఈ సందర్భంలో శాంతమ్మ, తమ కుటుంబానికి ఈ గౌరవం కలగడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ఈ విజయం తెలుగువారికి గర్వకారణమని, జేడీ వాన్స్‌తో పాటుగా ఉష కూడా అమెరికాలో తమ తెలుగు వారిని ప్రతినిధిగా నిలుస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.
This post was last modified on November 6, 2024 4:38 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…