ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇటీవల పిఠాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం గురించి ప్రస్తావిస్తూ హోం మంత్రి అనిత చురుగ్గా వ్యవహరించకపోతే ఆ శాఖను తాను చేపట్టాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.
ఈ వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్గతంగా చర్చించాల్సిన విషయాల గురించి పవన్ ఇలా ఓపెన్‌గా మాట్లాడడాన్ని కొందరు తప్పుబడితే.. ఇలా తప్పులను ప్రస్తావించి సరిదిద్దుకునేలా చేయడం మంచిదే అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో ఇప్పటికీ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న వైసీపీ మద్దతుదారులను ప్రభుత్వం అస్సలు అదుపు చేయలేకపోతోందంటూ టీడీపీ, జనసేన మద్దతుదారుల్లో ఉన్న అసహనాన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా నడిచింది. ఐతే పవన్ వ్యాఖ్యలను సానుకూలంగానే తీసుకున్న ప్రభుత్వం.. వెంటనే కార్యాచరణ మొదలుపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టి టీడీపీ, జనసేన ముఖ్య నేతలను కించపరిచిన వాళ్ల మీద పోలీసులు సీరియస్‌గా ఫోకస్ పెట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ సతీమణి భారతి దగ్గర పీఏగా పని చేసిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇతడి సోషల్ మీడియా పోస్టులు చూస్తే టీడీపీ, జనసేన మద్దతుదారులకు రక్తం మరిగిపోతుంది. పవన్, నారా లోకేష్‌ల గురించి జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు. ప్రభుత్వం మారినా కూడా ఇంకా చాలా పోస్టులు అలాగే ఉన్నాయి. ఇతగాడిని ఇంతకుముందే ఒకసారి అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
అది నిజమో కాదో కానీ.. అతను మాత్రం స్వేచ్ఛగా తిరిగేస్తున్నాడు. ఐతే ఇప్పుడు పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తమకు సహకరించని వర్రాను ఒక పోలీస్ అధికారి కొడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి.
మరికొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా పోలీసులు కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, పట్టాభి లాంటి నేతల విషయంలో పోలీసులు ఎంత దౌర్జన్యంగా వ్యవహరించారో తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న స్థాయి కార్యకర్తల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించట్లేదని.. ఎవరినైనా అరెస్ట్ చేసినా వెంటనే బయటికి వచ్చేస్తున్నారని.. అరెస్ట్ చేశాక వాళ్లకు తగిన బుద్ధి చెప్పట్లేదని.. అందుకే బయటికి వచ్చాక వాళ్లు మళ్లీ యథావిధిగా పోస్టులు పెడుతున్నారనే అసహనం టీడీపీ, జనసేన వర్గాల్లో ఉంది.
ఈ నేపథ్యంలోనే పవన్ ఇటీవలి వ్యాఖ్యలకు మద్దతు కూడా లభించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 6, 2024 5:16 pm
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…
గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…
రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…
టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్‌కు…