Political News

పవన్ వ్యాఖ్యలపై ఫస్ట్ రియాక్షన్ ఆ మంత్రిదే

పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ చేసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను పంచాయతీ రాజ్ శాఖా మంత్రిని మాత్రమేనని, అనిత హోం మంత్రి అని, ఒక వేళ తాను హోం శాఖా మంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని పవన్ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. పవన్ వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో హోం శాఖ ఫెయిల్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ తరఫు నుంచి మొట్టమొదటగా మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా జనరల్ గా ఇతర శాఖలపై తమ అభిప్రాయాలు చెబుతుండడం సహజమని నారాయణ అన్నారు. ఆ హోదాలో ఉన్న వారికి పూర్తి అధికారాలున్నాయని, ఎవరినీ తప్పుబట్టడానికి లేదని నారాయణ తెలిపారు. పవన్ వ్యాఖ్యలను ఒక అలర్ట్ గా తీసుకోవాలని, ప్రభుత్వంలో లోపాలు గుర్తించి సరిదిద్దుకోవడం తప్పు కాదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్ని చిన్న సమస్యలుంటే సీఎం చంద్రబాబు కో ఆర్డినేట్ చేస్తారని చెప్పారు. ఒక ఘటనను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారని, దానిపై హోం మంత్రి చర్యలు తీసుకుంటారని అన్నారు. హోం శాఖ తీసేసుకుంటానని పవన్ చెప్పలేదని నారాయణ అన్నారు. కొన్ని సార్లు లీగల్ గా కొన్ని పోలీసులు చేసేందుకు కొన్ని అభ్యంతరాలుంటాయని, దానివల్ల జాప్యం జరిగి ఉండవచ్చని, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చేస్తారని చెప్పారు.

ఇక, గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఏమీ చేయలేదని అన్నారు. పాత టెండర్లను రద్దు చేస్తూ సీఆర్‌డీఏ తీర్మానించిందని, కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందని అన్నారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారని, డిసెంబర్ 31న కొత్త టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. రాజధాని ప్రాంతంలో వరద నీటి నిర్వహణకు 3 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని, అందు కోసం నెదర్లాండ్స్ సంస్థతో ఒప్పందం కుదిరిందని నారాయణ తెలిపారు.

This post was last modified on November 4, 2024 10:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

45 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

10 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

10 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

12 hours ago