ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణ యించుకున్నట్టు తెలిసింది. తద్వారా.. ఆది నుంచి ఉన్న విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు.. ఇది మనది
అనే భావన ఆయన కల్పించనున్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను బట్టి.. రాజధాని అంటే.. కేవలం కొందరిదేనని.. రాష్ట్ర ప్రజలకు దీనిలో భాగస్వామ్యం ఉండదని కూడా కొన్నాళ్లు చర్చ నడిచింది. ఇప్పుడు కాకపోతే.. రేపైనా ఈ విషయం మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.
అంతేకాదు.. గతంలో హైదరాబాద్‌లోనూ.. ఇలానే విభేదాలు, వివాదాలు తెరమీదికి వచ్చాయి. దీనికి కారణం.. హైదరాబాద్ మాది అంటూ తెలంగాణ పౌర సమాజం ఉద్యమాలకు దిగింది. దీనిని డిఫెండ్ చేసుకునే అవకాశం ఏపీ ప్రజలకు లేకుండా పోయింది. ఎందుకంటే.. హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టారే తప్ప ఏపీకి చెందిన సాధారణ ప్రజలు నేరుగా పెట్టుబడులు పెట్టింది లేదు. పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును ప్రబుత్వం ఖర్చు చేసినా.. అది లెక్కలోకి రాలేదు.
ఇలాంటి రీజన్.. అనుమానం.. వంటివి అమరావతిపైనా ఉండే అవకాశం, రాజకీయంగా వైసీపీ చేసే అవకాశం మెండుగా ఉంది. అందుకే.. అమరావతి అందరిదీ అనే మానసిక భావన కల్పిస్తే.. ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు, కొందరు రైతులకు, కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదన్న చర్చ వస్తుంది. తద్వారా.. విభజన సమస్యలు, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉంటాయన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరినీ అమరావతిలో భాగస్వామ్యం చేయాలన్నది ఆయన నిర్ణయం.
ఏం చేస్తారు?
ప్రతి ఒక్కరినీ అమరావతిలో భాగస్వామ్యం చేసేందుకు వీలుగా.. భౌతిక, ఆర్థిక సాయాల దిశగా చంద్రబా బు అడుగులు వేస్తున్నట్టు సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. కొందరు.. భౌతిక సాయం చేసేందుకు ముం దుకు వస్తారు. అంటే.. నిర్మాణ రంగంలో కార్మికులను పురమాయించడం.. లేదా.. ఓ లారీ ఇటుకలు ఇవ్వడం.. రంగులు ఇవ్వడం ఇలా.. తమకు తోచిన విధంగా ప్రతి కుటుంబం సాయం చేసేందుకు వీలు కల్పిస్తారు.
రెండోది ప్రజల నుంచి వచ్చే ఐదేళ్ల పాటు ఆర్థిక సాయం తీసుకుంటారు. ప్రతి ఒక్కరి పేరుతోనూ.. కనిష్ఠంగా రూ.1 నుంచి గరిష్ఠంగా రూ.10 వరకు..(అంతకు మించి ఎంత ఇచ్చినా తీసుకుంటారు) ప్రతి నెలా తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి ఎలాంటి రసీదు ఉండకపోయినా.. తమ పేరు మాత్రం ఆన్‌లైన్‌లో ఎక్కేలా.. చూస్తారు. తద్వారా.. అమరావతి నిర్మాణంలో మేం కూడా భాగస్వాములమే.. అనే భావన కల్పిస్తారు. ఈ నిధులను నిర్మాణానికి వినియోగిస్తారు. ఇలా.. రాష్ట్రంలో ప్రస్తుతం చిన్నా పెద్ద అందరూ కలిపి 4.7 కోట్ల మంది ప్రజలు ఉన్నారు.
వీరి నుంచి రూపాయి చొప్పున తీసుకున్నా.. నెలకు 5 కోట్ల రూపాయలు వస్తాయి. ఏడాదికి 60 కోట్లు, ఐదేళ్లలో 7.2 వేల కోట్ల వరకు సమకూరతయి. ఇది రూపాయి చొప్పున తీసుకుంటే. ఇంతకు మించి ఇచ్చేవారు ఉంటే మరింత పెరుగుతుంది. తద్వారా నిధులతోపాటు.. ప్రజలకు కూడా బాధ్యత, మానసిక సంతృప్తి కూడా పెరుగుతుందని.. భావిస్తున్నారు. అంతేకాదు.. రేపు ఏదైనా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా.. అమరావతిని కదలించకుండా కూడా… ప్రజల సెంటిమెంటు అడ్డు పడుతుందన్నది బాబు ఆలోచన.
This post was last modified on November 3, 2024 5:23 pm
ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…
కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…
తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…
కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…