తెలంగాణ రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో ఊహించని గుర్తింపు, అవకాశాలు సృష్టించుకున్నది మరియు సాధించుకున్నది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దీనికంతటికీ రేవంత్ ప్లానింగ్, కలిసి వచ్చిన సమయం, అధిష్టానం పెద్దలు కల్పించిన అవకాశాలు అనేది నిజం. ముఖ్యంగా పార్టీ యువనేత రాహుల్ గాంధీ కల్పించిన ప్రోత్సాహం దీనికి కారణం అని అనుకోవచ్చు. అయితే, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కి గ్యాప్ వచ్చిందని అంతర్గత గుసగుసలు మొదలై రాజకీయ పార్టీలు బహిరంగంగా ప్రకటించేవరకూ చేరిపోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం లెక్క తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 6 నుంచి 20 రోజులపాటు మొత్తం 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయింది. అయితే, ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ ఆరు లేదా ఏడో తేదిన కులగణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై మీటింగ్ నిర్వహిస్తామని, ఈ సమావేశానికి తమ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ కులగణన ప్రక్రియపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అయిన రాహుల్ తెలంగాణ రాష్ట్రానికి వస్తుండటం ఆసక్తిని రేకెత్తించే అంశమే. అయితే, ఈ పర్యటన వెనుక పరిణామాలే ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుండగా ప్రభుత్వం తరఫున ఇంతటి కీలకమైన అంశాన్ని ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటించడం లేదనేది కీలకంగా మారింది. ఒకవేళ పార్టీపరమైన అంశంగా భావించినా, ఇటీవలే గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ షెడ్యూల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెల్లడించలేదని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు గమనించిన వారు, సహజంగానే తమదైన శైలిలో ఈ విశ్లేషణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సైడ్ చేసేశారు అనేది నిజమేనని చెప్తున్నారు. అందుకే పార్టీ పరంగానే సమాచారం వస్తోంది తప్ప… ప్రభుత్వం నుంచి వెల్లడి కావటం లేదని చెప్తున్నారు. మరోవైపు రేవంత్ సన్నిహితులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి పార్టీ నేతగా రాహుల్ ను ఆహ్వానించడం సరికాదు కాబట్టే పీసీసీ చీఫ్ ఈ మేరకు వివరాలు చెప్పారంటూ సర్దిచెప్తున్నారు.
This post was last modified on November 3, 2024 4:18 pm
నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్…
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ…
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…