విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే. 500 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుబారా చేసి హైకోర్టు, ఎన్ జీటీ వద్దంటున్నా వినకుండా రుషికొండపై నిర్మాణాలు చేపట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. రుషికొండపైకి ప్రతిపక్ష నేతలనుగాని, వైసీపీయేతర వ్యక్తులను కానీ ఐదేళ్లపాటు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రుషికొండపై ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారిగా పర్యటించారు.
రుషికొండలోని 7 భవనాల సముదాయాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎం తన విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం చరిత్రలో లేదని చంద్రబాబు విమర్శించారు. కలలో కూడా ఊహించనిది జరిగిందని, ఒక వ్యక్తి విలాసం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు అన్న విషయం ఈ భవనాలు చూసాకే తెలిసిందని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రుషికొండ భవనాల్లోకి వెళ్లే కొద్దీ గుండె చెదిరిపోయి వాస్తవాలు బయటకు వస్తున్నాయని అన్నారు.
గతంలో మీడియా, ప్రతిపక్ష నేతలు ఎంత ప్రయత్నించినా రుషికొండపైకి అనుమతించలేదని, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా చేశారని గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్య పెట్టారని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా ఏదైనా చేయొచ్చు అనేదానికి రుషికొండ ఒక ఉదాహరణ అని అన్నారు. గతంలో రుషికొండపైకి రావాలని తాను, తన మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసినా అడ్డుకున్నారని అన్నారు. ఈరోజు ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, తమకు ప్రజలు వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు అధికారం ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.
విశాఖలోని అత్యంత అందమైన ప్రాంతం రుషికొండ బీచ్ అని, ఈ భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలాగా కట్టుకున్నారని చెప్పుకొచ్చారు. రాజుల కాలంలో చక్రవర్తులు కూడా ఇటువంటి భవనాలు నిర్మించుకోలేదని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టి ఇటువంటి ఖరీదైన భవనాలు కట్టడం చూసి ఆశ్చర్యం, ఉద్వేగం కలిగిందని…బాత్ రూమ్ కోసం 36 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆశ్చర్యపోయారు. జగన్ ఏమైనా రారాజు అనుకుంటున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ భవనాలను అందరికీ చూపిస్తామని, త్వరలోనే ఇందులోకి ప్రజలను అనుమతిస్తామని అన్నారు. ఈ భవనాలను ఎందుకు వాడుకోవాలో తనకు అర్థం కావడం లేదని, ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం ఏంటో తనకు తెలియడం లేదని చెప్పారు. ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే దీనికి సమాధానం చెప్పాలని జగన్ ను డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చిన సరే విశాఖలో నేవీ గెస్ట్ హౌస్ లోనే ఉన్నారని, పర్యాటకశాఖ కోసమే రుషికొండ ప్యాలెస్ నిర్మించామని జగన్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పిందని గుర్తు చేశారు.
తాను ఎన్నో ప్రపంచ దేశాలలో పర్యటించానని, కానీ, ఇటువంటి ఖరీదైన భవనాలను ఎక్కడా చూడలేదని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైట్ హౌస్, రాష్ట్రపతి భవన్ లో కూడా ఇటువంటి సౌకర్యాలు లేవని అన్నారు.
This post was last modified on November 2, 2024 10:00 pm
పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్…
దేశం మొత్తం ఎదురు చూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి. అందులో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’…
నితిన్-రష్మి-వెంకీ కుడుముల కలయికలో వచ్చిన ‘భీష్మ’ అప్పట్లో పెద్ద హిట్టే అయింది. మళ్లీ ఈ కలయికలో సినిమాను అనౌన్స్ చేసినపుడు…
తమిళ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ‘యారుడీ నీ…
తమిళ కథానాయిక త్రిషకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. వర్షం. ఆ సినిమాతో ఒకేసారి ఆమె చాలా మెట్లు…
2019లోనే శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ రుక్మిణి వసంత్ కు బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. సప్తసాగరాలు దాటి సైడ్…