తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో తానున్నాంటూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీ సై అంటోంది. గత కొద్దికాలంగా సైలెంట్‌గా ఉన్న ఈ పార్టీ పెద్ద, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక కామెంట్లు చేశారు.
ఏకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ రథసారథి కేసీఆర్‌కు బీపీ పెంచేలా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చేలా వ్యాఖ్యానించారు. ఇదంతా కేసీఆర్ రాజకీయం గురించి, ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన మూసి ప్రక్షాళన గురించి.
రేవంత్ సర్కార్ మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు హైడ్రాను తీసుకు రాగా… ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ పేదవాళ్ల ఇల్లు కూల్చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అయితే, ఊహించని రీతిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ సర్కారుకు మద్దతుగా మాట్లాడారు. మూసీ ప్రక్షాళనలో ఇళ్ల జోలికి రాకుండా ఉంటే స్వాగతిస్తామని తెలిపారు. అంతేకాకుండా మూసీ ప్రక్షాళన కోసం గతంలోనే బీఆర్‌ఎస్ పార్టీ ప్రణాళికలు చేయలేదా? అంటూ ప్రశ్నించడమే కాకుండా.. ఆ ప్రక్షాళన ఆ ప్లాన్ తాను వద్దని చెప్పలేదా ? అని సూటిగా బీఆర్ఎస్ నేతలను ఓవైసీ ప్రశ్నించారు.
ఇదే సందర్భంగా ఓవైసీ మరిన్ని సంచలన కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలంటూ సూచించిన ఓవైసీ… తాను నోరు విప్పితే బీఆర్‌ఎస్ నేతలు ఇబ్బందులు పడతారన్నారు. అందుకే వాళ్లకి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలకు అప్పట్లో అహంకారం ఉండేదని ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 24 మంది ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్‌ఎస్ మళ్లీ గెలిచేదని విశ్లేషించారు. ఎంఐఎం మద్దతుతోనే బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని… ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో ఎక్కువ సీట్లు రావడానికి కారణం తామేనని ఓవైసీ ప్రకటించారు.
కాగా, తెలంగాణ సర్కారుకు మూసి నది ప్రక్షాళన అంశం తీవ్ర ఇరకాటంగా మారిన తరుణంలో, బీఆర్ఎస్ పార్టీ ఓ రేంజ్ లో ఈ అంశాన్ని వాడుకుంటున్న క్రమంలో… ఒకనాడు ఆ పార్టీతో పెద్ద ఎత్తున అంటకాగిన ఓవైసీలు ఇప్పుడు వారిని తప్పుపట్టడమే కాకుండా, వ్యక్తిగత ఈగోల వరకూ ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించడం…. రేవంత్ ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ అని చెప్పుకోచ్చు. మరోవైపు ఈ పరిణామం అధికారం కోల్పోయి ఇప్పటికే అపసోపాలు పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా షాకింగ్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు.
This post was last modified on November 2, 2024 10:04 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…