ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రీకాకుళం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీపై, జగన్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని, పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవలేదని చంద్రబాబు అన్నారు.
తనను, తనతో పాటు ఎంతోమందిని గత ప్రభుత్వంలో హింసించారని, అయినా సరే రాజీలేని పోరాటం చేసి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ లేకుండా దౌర్భాగ్యకరమైన రోజులు జగన్ పాలనలో చూసామని మండిపడ్డారు. అయితే, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళబోనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
దీపం-1 తానే ఇచ్చానని, ఇప్పుడు దీపం-2 పథకం కూడా తానే ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఖర్చు తగ్గించేందుకు ఉచిత గ్యాస్ ఇస్తున్నానని, భర్త కంటే భార్య ఎక్కువ ఆదాయం సంపాదించుకునే పరిస్థితిని డ్వాక్రా సభ్యుల ద్వారా కల్పించాలని అన్నారు. మహిళలు, ఆడబిడ్డలకు పథకాలు అమలు చేస్తూ వచ్చానని చెప్పారు.
సిలిండర్ పథకం ప్రారంభించిన సందర్భంగా శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన చంద్రబాబు టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పెన్షన్ అందించారు. ఆ కుటుంబానికి ఇల్లు లేదని తెలుసుకొని చంద్రబాబు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి ఇంటి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ను ఆదేశించారు.
This post was last modified on November 2, 2024 6:17 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…