వైసీపీ నేతలకు సంబంధించి రోజుకో కేసు వెలుగు చూస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ సహా.. ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కేసుల్లో చిక్కుకుని జైలు-బెయిల్ అంటూ.. తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు మరో కేసు వెలుగుచూసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి మేరుగ నాగార్జునపై విజయవాడకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అన్ని విధాలా మంత్రి మోసం చేశారని ఆమె పేర్కొనడం గమనార్హం.
విషయం ఏంటంటే..
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేరుగ నాగార్జున ఉన్నత విద్యావంతుడు, మాజీ ప్రొఫెసర్ కూడా. ఆయనకు వైసీపీ హయాంలో మంత్రి పోస్టు దక్కింది. గతంలో ఎప్పుడూ కూడా ఆయనపై ఎలాంటి వివాదాలు లేకపోవడం గమనార్హం. కానీ, అనూహ్యంగా ఇప్పుడు ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది. విజయవాడకు చెందిన పద్మావతి అనే మహిళ.. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు.
“మాకు చిన్నపాటి కాంట్రాక్టులు ఇప్పిస్తామని మాజీ మంత్రి నాగార్జున తన హయాంలో హామీ ఇచ్చారు. రోజూ నాతో ఫోన్‌లో మాట్లాడేవారు. ఈ క్రమంలో కాంట్రాక్టుల పేరుతో మా నుంచి 90 లక్షల రూపాయలు తీసుకున్నారు. నన్ను లైంగికంగా కూడా వాడుకున్నారు. ఆ తర్వాత.. కాంట్రాక్టులు ఇప్పించలేదు. ఈ నేపథ్యంలో మా డబ్బులు(90 లక్షలు) తిరిగి ఇవ్వమని కోరుతుంటే.. మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. చంపేస్తామని కొందరు ఫోన్లు చేస్తున్నారు” అని నాగార్జునపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
పద్మావతి చేసిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు మీడియాకు తెలిపారు. దీనిలో నిజాలను గుర్తించిన తర్వాత.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పద్మావతి ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. దీనిపై మేరుగ నాగార్జున స్పందించాల్సి ఉంది.
This post was last modified on November 2, 2024 6:12 am
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…