Political News

1 నుంచే దూకుడు.. బాబు మామూలు సీఎంకాదుగా.. !

ఏపీలో కూట‌మి స‌ర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వ‌చ్చిన తొలినాళ్ల‌లో చేయాలనుకున్న ప‌నుల‌ను కొంత లేటుగా ప్రారంభించేవారు. అనేక వాయిదాలు వేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క పింఛ‌ను పంపిణీని మాత్ర‌మే స‌మ‌యానికి చేప‌ట్టారు. జూలై 1న పంచేశారు. కానీ, ఉచిత ఇసుక విష‌యంలో కొంత ఆల‌స్యంగానే ప్రారంభించారు. నూత‌న మ‌ద్యం విధానాన్ని కూడా ఆలస్యంగానే చేప‌ట్టారు.

కానీ, ఉచిత గ్యాస్ ప‌థ‌కంపై మాత్రం తీసుకున్న నిర్ణ‌యం.. చెప్పిన స‌మ‌యం దాట‌కుండా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇది చంద్ర‌బాబుకు కూట‌మి స‌ర్కారుకు కూడా సంచ‌ల‌న‌మేన‌ని చెప్పాలి. ఇలా అత్యంత వేగంగా తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌డం వెనుక‌.. ఓ రీజ‌న్ ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేయ‌డం లేదంటూ.. వైసీపీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాబోయే రోజుల్లో మ‌రింత ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఐదో నెల ప్రారంభానికి(స‌ర్కారు ఏర్ప‌డి న‌వంబ‌రు 12తో ఐదు నెల‌లు) ముందే.. సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేయ‌డం ద్వారా.. విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబుఆలోచ‌న‌. దీనికి తోడు.. ప్ర‌చారం చేసుకునేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఈ ప‌థ‌కాన్ని చెప్పిన స‌మ‌యానికి ప్రారంభిస్తున్నార‌న్న‌ది ఒక చ‌ర్చ‌.

ఇక‌, దీనికితోడు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే ఒక్క కార్య‌క్ర‌మాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్ద‌రూ క‌లిసి ప్రారంభించారు. అది కూడా ఒకేరోజు, ఒకే స‌మ‌యంలో. అదే.. గ్రామ‌స‌భ‌లు. దీనికి పెద్ద ఎత్తున మంచి పేరు వ‌చ్చింది. రికార్డు కూడా.. సృష్టించారు. ఆ త‌ర్వాత‌.. ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా.. ఎవ‌రికి వారే చేప‌ట్టారు. కానీ, ఇప్పుడు. ఉచిత గ్యాస్ పంపిణీని మాత్రం ఇద్ద‌రూ క‌లిసిచేప‌డుతుండ‌డం మ‌రో విశేషం. చంద్ర‌బాబు శ్రీకాకుళంలో ప్రారంభిస్తుండ‌గా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌శ్చిమ‌గోదావ‌రిలో ప్రారంభిస్తున్నారు. ఇద్ద‌రూ ఒకే స‌మ‌యంలో దీనికి శ్రీకారం చుడుతున్నారు. త‌ద్వారా.. మ‌రింత హైప్ తీసుకురావొచ్చ‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచ‌న‌గా ఉంది.

This post was last modified on November 1, 2024 3:04 pm

Share

Recent Posts

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 minutes ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

31 minutes ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

57 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

2 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

2 hours ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago