ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు. అనేక వాయిదాలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క పింఛను పంపిణీని మాత్రమే సమయానికి చేపట్టారు. జూలై 1న పంచేశారు. కానీ, ఉచిత ఇసుక విషయంలో కొంత ఆలస్యంగానే ప్రారంభించారు. నూతన మద్యం విధానాన్ని కూడా ఆలస్యంగానే చేపట్టారు.
కానీ, ఉచిత గ్యాస్ పథకంపై మాత్రం తీసుకున్న నిర్ణయం.. చెప్పిన సమయం దాటకుండా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇది చంద్రబాబుకు కూటమి సర్కారుకు కూడా సంచలనమేనని చెప్పాలి. ఇలా అత్యంత వేగంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం వెనుక.. ఓ రీజన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదంటూ.. వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఐదో నెల ప్రారంభానికి(సర్కారు ఏర్పడి నవంబరు 12తో ఐదు నెలలు) ముందే.. సూపర్ సిక్స్‌ను అమలు చేయడం ద్వారా.. విమర్శలకు చెక్ పెట్టాలన్నది చంద్రబాబుఆలోచన. దీనికి తోడు.. ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ పథకాన్ని చెప్పిన సమయానికి ప్రారంభిస్తున్నారన్నది ఒక చర్చ.
ఇక, దీనికితోడు.. ఇప్పటి వరకు ఒకే ఒక్క కార్యక్రమాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి ప్రారంభించారు. అది కూడా ఒకేరోజు, ఒకే సమయంలో. అదే.. గ్రామసభలు. దీనికి పెద్ద ఎత్తున మంచి పేరు వచ్చింది. రికార్డు కూడా.. సృష్టించారు. ఆ తర్వాత.. పలు కార్యక్రమాలు చేపట్టినా.. ఎవరికి వారే చేపట్టారు. కానీ, ఇప్పుడు. ఉచిత గ్యాస్ పంపిణీని మాత్రం ఇద్దరూ కలిసిచేపడుతుండడం మరో విశేషం. చంద్రబాబు శ్రీకాకుళంలో ప్రారంభిస్తుండగా.. పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరిలో ప్రారంభిస్తున్నారు. ఇద్దరూ ఒకే సమయంలో దీనికి శ్రీకారం చుడుతున్నారు. తద్వారా.. మరింత హైప్ తీసుకురావొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది.
This post was last modified on November 1, 2024 3:04 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…