క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అన్నారు కానీ.. ఇప్పుడు ఇది రాజకీయాలకు బాగా నప్పుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. పార్టీలతో సంబంధం లేదు.. నాయకులతోనూ సంబంధం లేదు. అంతా.. ఒక మాయా రాజకీయం దేశాన్ని కమ్మేసింది. ఏపీ విషయానికి వస్తే.. వైసీపీలో పదవులు అనుభవించిన వారు కూడా.. ఇప్పుడు తిరగబడుతున్నారు.
వీరితో పోలిస్తే.. పదవులు ఆశించి.. భంగ పడిన వారి బాధ మరో విధంగా ఉంది. ఈ నేపథ్యంలో వారు మరింత దూకుడుగా ముందు వచ్చేస్తున్నారు. అయితే.. ఇలాంటి వారిని చేర్చుకునేందుకు కొన్నికొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నా.. అధికార పార్టీ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుండడం గమనార్హం. ఉదాహరణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు వైసీపీ నుంచి వచ్చేస్తామని చెబుతున్నారు.
వీరిలో ఒకరు ఇప్పటికే వైసీపీ రాజీనామా కూడా చేశారు. మరొకరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో వారు వెయిటింగ్‌లో ఉన్నారు. వారే.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. ఆయన ఎప్పుడెప్పుడు వచ్చి.. సైకిల్ ఎక్కుదామా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
కానీ, చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికి ఓ మంత్రి కారణమని అంటున్నారు. ఇక, మరో నాయకుడు.. కరణం బలరామకృష్ణమూర్తి. ఈయన కూడా.. ఎదురు చూస్తున్నారు. వచ్చెయ్ అంటే.. చాలు.. జేబులోనే ఉన్న రాజీనామా పత్రాన్ని వైసీపీకి గిరాటు వేసి.. వచ్చేయాలని భావిస్తున్నారు. కానీ, ఇక్కడ కూడా.. మరోమంత్రి అడ్డు పడుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరి వ్యవహారం కూడా.. నానుతూనే ఉంది. దీపావళి వెళ్లాక.. మీకు శుభ వార్త వస్తుందని.. పార్టీ నుంచి సంకేతాలు వచ్చినట్టు సమాచారం. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 1, 2024 10:31 am
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…