వి. విజయసాయిరెడ్డి. వైసీపీలో అగ్రనేత, ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కూడా. ఈయన కథ ఇక్కడితో అయిపోలేదు. కేంద్రంలోని రాజకీయ నేతలతో వైసీపీకి సత్సంబంధాలు పెంపొందించడంలోనూ.. పార్టీకి అవసరమైన ఢిల్లీ ముడిసరుకును అందించడంలోనూ.. సాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గుర్తు పట్టి పిలిచి మాట్లాడేంత చనువు కూడా ఉన్న నాయకుడు కావడం మరో విశేషం.
దీనికి కారణం.. వైసీపీ తరఫున ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతుండడమే. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా.. సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ వ్యవహారాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకు వస్తున్నారు. ఇటు పార్లమెంటులోనూ, అటు రాజకీయంగా కూడా.. దేశ రాజధానిలో వైసీపీ రాజకీయాలను జోరుగా ముందుకు తీసుకువెళ్లిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు.. ఈయనను మించిన స్థాయిలో మరో నాయకుడిని జగన్ తయారు చేసుకుంటున్నారు.
రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు కాబట్టి.. పైగా సాయిరెడ్డిపై కొన్నాళ్ల కిందట పార్టీ మారుతున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. అందుకే ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని.. సాయిరెడ్డికి సమాంతరంగా మరో నేతను ప్రిపేర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆయనే.. కూటమి సునామీలోనూ విజయం దక్కించుకున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏ పనికావాలన్నా.. జగన్ ఈయనకే చెబుతుండడం గమనార్హం.
ఎన్నికల అనంతరం.. ఢిల్లీలో నిర్వహించిన ధర్నా వ్యవహారంలోనూ.. సాయిరెడ్డితో సమానంగా గురు మూర్తి సేవలు అందించారు. తర్వాత.. పార్టీ పరంగా ఏం చెప్పినా చేయడంలోనూ ఆయన ముందున్నారు. పైగా జగన్‌కు అత్యంత నమ్మకస్తుడే కాకుండా.. వీర విధేయుడు కూడా కావడం కలిసి వస్తోంది. మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో సాయిరెడ్డిని ఓవర్ టేక్ చేసే స్థాయికి మద్దెల గురుమూర్తి ఎదిగినా ఆశ్చర్యం లేదు. వినయం, విధేయతతో పాటు. కేంద్రంలో గత ఐదేళ్లుగా ఎంపీగా ఉండడం, పరిచయాలు.. వంటివి గురుమూర్తికి మరింతగా కలిసి వస్తున్నాయి.
This post was last modified on October 31, 2024 2:49 pm
వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండ చూసుకొని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల…
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణంలో విరామం లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించే…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది.…
2025 మొదటి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈ రోజు సాయంత్రం ఏఎంబిలో రాజమౌళి అతిథిగా…
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించడాన్ని పెద్ద పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా గొప్ప అవకాశంగా భావిస్తారు. ఆయనతో…
ఇటీవల ఓ చర్చా వేదికలో హిందీ సినిమాల మీద తెలుగు చిత్రాల ఆధిపత్యం గురించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ…