ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా పరుగులు పెడుతోంది. ప్రజారవాణాకు సంబంధించి తాజాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఏకంగా 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. గుంటూరు ఆర్టీసీ డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులను సర్కారు కేటాయించింది. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
రాజధాని అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకతను గుర్తించిన సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి వచ్చే 100 బస్సులను గుంటూరు ఆర్టీసీకి మాత్రమే కేటాయించనున్నారు. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడపనున్నారు. మిగతా బస్సులన్నీ పల్లెవెలుగు బస్సుల కింద నడుస్తాయి.
గుంటూరు నుంచి విజయవాడకు 20, గుంటూరు నుంచి పొన్నూరుకు 15, గుంటూరు నుంచి తెనాలికి 30, గుంటూరు నుంచి హైకోర్టుకు 5, గుంటూరు నుంచి సచివాలయానికి 5, గుంటూరు నుంచి చిలకలూరి పేటకు 10, గుంటూరు నుంచి సత్తెనపల్లికి 15 బస్సులు నడపనున్నారు. ప్రస్తుతం 100 కి.మీ కంటే తక్కువ దూరం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. పెదకాకాని బస్టాండ్ వెనుక ఆర్టీసీకి చెందిన 3.5 ఎకరాల్లో ఈ బస్సులకు చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండులో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధానంగా అమరావతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో గుంటూరులో కాలుష్యాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్‌ప్రెస్ బస్సులను పల్లెవెలుగు బస్సులుగా మారుస్తున్నారు. అయితే వీటి నిర్వహణ వ్యయం పెరుగుతుండడంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపింది.
This post was last modified on October 29, 2024 3:28 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…