చంద్రబాబు మనసులో ఏముందో.. తాజాగా తమ్ముళ్లకు వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగానే అడుగులు వేయాలని ఆయన సూచించారు. నిజానికి చాలా చోట్ల కూటమి పార్టీల నాయకులు.. కలివిడిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కలిసి ముందుకు సాగడం లేదు. ఇది కూటమిలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల నాటికి నాయకులు కలివిడిగా లేకపోతే.. వైసీపీకి అవకాశం ఇచ్చినట్టనే సంకేతాలు ఆయన పంపించారు. శుక్రవారం సాయంత్రం.. పార్టీ కీలక నాయకులతో ఆయన భేటీ అయినప్పుడు.. ఈ విషయాలే చర్చకు వచ్చాయి. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు కూడా పంపించారు. క్షేత్రస్థాయిలో కలివిడి లేకపోవడంతో నియోజకవర్గాల్లో కూటమి ప్రభావం తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇది జరగకుండా చూడాలని చెప్పారు.
ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా బాబు చర్చించారు. ఈ జిల్లాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఆయా జిల్లాల ఇంచార్జ్‌లను అలెర్ట్ చేశారు. వైసీపీ నేతల దూకుడు తో.. కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని.. నాయకులు ఏకతాటిపై ఉండాలని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇప్పుడు టీడీపీకి కీలకంగా మారనుంది.
వచ్చే ఎన్నికల నాటికి సహజంగానే సర్కారుపై ఏర్పడే వ్యతిరేకతను తగ్గించుకుని.. ప్రజల మధ్య నిలిచే బాధ్యతను కూడా తమ్ముళ్లపైనే పెట్టడం ద్వారా.. చాలా వ్యూహాత్మకంగానే చంద్రబాబు అడుగులు వేశారని చెప్పారు. అంటే..ఎక్కడికక్కడ పార్టీలో వ్యతిరేకత రాకుండా.. కూటమి కలివిడిగా ముందుకు సాగేలా చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక, సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు.
This post was last modified on October 27, 2024 4:23 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…