Political News

నెల రోజుల బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ ఇదే..!

ప్లాన్ లేనిదే.. ఏ ప‌ని కూడా చేయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్పుడు ఫ్యూచ‌ర్ ప్లాన్ వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇటు పార్టీ ప‌రంగా.. అటు ప్ర‌భుత్వం ప‌రంగా కూడా.. చంద్ర‌బాబు చాలా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనిలో భాగంగా వ‌చ్చే మూడు నెల‌ల‌కు ఇటు ప్ర‌భుత్వం, అటు పార్టీకి సంబంధించిన ఫ్యూచ‌ర్ ప్లాన్‌ను చంద్ర‌బాబు రెడీ చేసుకున్నారు. దీని ప్ర‌కార‌మే ఆయ‌న అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు

పార్టీ ప‌రంగా..
ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేయ‌నున్నారు. మూ డు పార్టీలు కలిసి పని చేయడం ద్వారా క‌లిగిన ప్ర‌యోజ‌నాల‌ను పార్టీ కేడ‌ర్‌కు వివ‌రించారు. త‌ద్వారా ముందు ముందు కూడా.. ఇదే స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. మండలా ల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి.. కూట‌మి పార్టీల ఐక్య‌త‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల్సి ఉంది.

ప్ర‌భుత్వ ప‌రంగా..
ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ప‌నులు, అందించిన సంక్షేమాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో చేప‌ట్టే కార్య‌క్ర‌మానికి కూడా ఇప్ప‌టి నుంచే ప్ర‌చారం ఉండేలా చేసుకోవాలి. కేంద్రం అమరావతి రైల్వే లైనుకు ఆమోదం తెలిపిన విష‌యం, రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం, 4,300 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్ర‌ణాళిక‌లతోపాటు నాలుగు నెలల్లో అమలు చేసిన పథకాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించనున్నారు.  

ఫ్యూచ‌ర్ ప్లాన్‌..
వ‌చ్చే మూడు మాసాల‌కుగాను చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్‌తోనే ఉన్నార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ 6 పాలసీలకు విస్తృత ప్ర‌చారం క‌ల్పి స్తారు. `జాబ్ ఫస్ట్` విధానంతో నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు ప్రయత్నించ‌నున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు అడుగులు ప‌డేలా ఇప్ప‌టి నుంచి ప్ర‌య‌త్నాలు చేప‌ట్టనున్నారు. దేశం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ల‌నున్నారు. త‌ద్వారా.. ఎన్డీయే కూట‌మి పాల న‌పై స‌మ‌గ్ర‌మైన చ‌ర్చ జ‌ర‌గాల‌న్న‌ది చంద్ర‌బాబు ప్లాన్‌గా ఉంది. 

This post was last modified on October 27, 2024 9:49 am

Share

Recent Posts

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

7 minutes ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

46 minutes ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

1 hour ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

1 hour ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

3 hours ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

3 hours ago