ఫస్ట్ టైమ్.. ఒక నేత వైసీపీ నుంచి బయటకు.. ఓ రేంజ్‌లో జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు అనేక మంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ భాను వంటి వారు పార్టీకి రాం రాం చెప్పారు. అయతే.. ఎవరూ కూడా నోరు చేసుకోలేదు. జగన్‌పై భారీ స్థాయిలో విమర్శలు గుప్పించింది కూడా లేదు. తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తూ.. వారు బయటకు వచ్చారు. అయితే.. ఫస్ట్ టైమ్.. వాసిరెడ్డి పద్మ మాత్రం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆయనకు బాధ్యతలేదని, పాలనపై పట్టులేదని, ఏం చెప్పినా.. వినకుండా వేధించారని, పాలన ఎలా చేయాలో కూడా తెలియద ని.. మహిళలను రాజకీయంగానే వాడుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు అంత తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. చాలా సీరి యస్‌గానే వర్కవుట్ అవుతాయి. ఆమె ఏ పార్టీలోకి వెళ్తారో ఇంకా తెలియదు.. ఆమెను ఎవరో తెరవెనుక ఉండి ఆడిస్తున్నారని అనుకున్నా.. ఇప్పటికిప్పుడు దానికి కూడా అర్థం ఉండదు. కానీ, వాస్తవాలు ఏంటి? అనేది మాత్రం జగన్ చెప్పి తీరాలి. ఇంకా మౌనంగానే ఉంటే.. ఇంకా తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చుంటే.. జగన్‌కే కాదు.. పార్టీకి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవు.
నిజానికి ఇలాంటి వారు తెరమీదికి వచ్చినప్పుడు.. సహజంగా పార్టీలోని మహిళా నాయకులు రియాక్ట్ అవుతారు. మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలపై వారు స్పందిస్తారు. సరైన కౌంటర్లు కూడా ఇస్తారు. కానీ, వైసీపీ గంటలు గడిచినా ఏ ఒక్కరూ మీడియా ముందుకు రాలేదు. ఏ ఒక్కరూ పద్మ వ్యాఖ్యలు ఖండించింది కూడా లేదు. పోనీ.. తాడేపల్లి నుంచి ఒక్క ప్రకటన కూడా బయటకు రాలేదు. వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది కూడా. మరి దీనిని ఎలా చూడాలి. ఇంకా వెచి చూస్తున్నారా? ఏం జరిగినా ప్రమాదం లేదు.. కొంప మునిగేదీ లేదని జగన్ భావిస్తున్నారా? అంటే.. ఇదే నిజమైతే.. ఇక చూసు కునేందుకు ఏమీ మిగలదు.
వరదు కళ్యాణి అనే ఒక నేత ఏదో చూచాయగా స్పందించినా.. వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలకు వచ్చినంత రేంజ్ అయితే రాలేదు. గతంలో మంత్రులుగా చేసిన మహిళా నాయకులు ఏమైపోయారు. రోజా, తానేటి వనిత, సుచరిత, ఉష శ్రీచరణ్ వంటి బలమైన వాయిస్ ఉన్నవారంతా ఏం చేస్తున్నారన్నది ప్రశ్న. వారు కూడా తమ తమ దారులు వెతుక్కుంటున్నారా? లేక.. మనకెందు కులే అని దాక్కున్నారా? అనేది ప్రశ్న. ఎలా చూసుకున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వాసిరెడ్డి పద్మదే పైచేయిగా మారింది. ఇలాంటి సమయంలో కూడా జగన్ మీడియా ముందుకు రాకుంటే.. అసలు ఏం జరిగిందో చెప్పకుంటే.. ఆయనే అభాసుపాలవుతారనడంలో సందేహం లేదు.
This post was last modified on October 26, 2024 5:24 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…