టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవడం లేదన్న ఆవేదన సీఎం చంద్రబాబులో కనిపి స్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు కీలక అంశాల్లో ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోయి.. అది అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.
ఇప్పటికే అనేక సార్లు.. చంద్రబాబు ఈ విషయంపై తమ్ముళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి కేబినెట్ మీటింగ్‌లోనూ.. మంత్రులకు కూడా హితవు పలుకుతున్నారు. ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలంటూ.. ఆయన పదే పదే నూరిపోస్తున్నారు.
అయినా.. ఎమ్మెల్యేల దూకుడు ఆగడం లేదు. దీనిపై పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేప థ్యంలో తాజాగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నారు.
దీనిలో సీనియర్లు, మంత్రులు కూడా ఉండనున్నారు. వీరు తీవ్ర ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. అదేసమయంలో ఎమ్మెల్యేల పనితీరును కూడా అంచనా వేయనున్నారు.
ఇలా ఆరోపణలు వస్తున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వారి ఆదాయ వ్యయాలు.. వంటివాటిని మదింపు చేయనున్నట్టు చెబుతున్నారు. తద్వారా… వారిని నేరుగా చంద్రబాబు కోర్టులోనే నిలబెట్టి.. చర్యలు తీసుకుంటారని తెలిసింది.
అయితే.. ఇది పైకి చెప్పుకొనేందుకు బాగానే ఉన్నా.. ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సీనియర్ మోస్ట్ నాయకులే చాలా మంది ఉన్నారు.
అందుకే.. చంద్రబాబు పదే పదే చెబుతున్నా.. ఎవరూ మాట వినిపించుకోవడం లేదు. పైగా చంద్రబాబు ను కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు ఈ కమిటీ వేయడం ద్వారా.. కొంతలో కొంత తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.
మరీ భయం లేకుండా పేట్రేగుతున్న కొన్ని జిల్లాల నాయకులకు ఆ మాత్రం భయం కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on October 25, 2024 4:19 pm
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…