ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభవం సంతరించుకున్న విషయం తెలిసిందే. మరో 30 ఏళ్లకు సరిపడా చార్జింగ్‌ను సంపాయించుకుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచలాన్ని ఏకం చేయడంలో పార్టీ అధినేత చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ తన హవా కొనసాగిస్తుండడం గమనార్హం.
2010 నుంచి కూడా అండమాన్‌లో పార్టీ పుంజుకుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయం దక్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్నట్టుగానే.. అక్కడ ఎప్పటి నుంచో బీజేపీతో చేతులు కలపడం మరో ఆశ్చర్యకర విషయం. ఏపీలో 2019-24 మధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ, అండమాన్‌లో మాత్రం టీడీపీ.. కమల నాథులు కలిసి.. మునిసిపాలిటీలో అధికారం దక్కించుకున్నారు.
ఇంతింతై..
ఇంతింతై అన్నట్టుగా కేంద్రపాలిత ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది.
ఇప్పుడు ఏం జరిగింది?
తాజాగా అండమాన్ నికోబార్ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్రబాబు నియమించారు. బలమైన నాయకుడిగా పేరున్న నక్కల మాణిక్యరావు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామకంతో పార్టీ మరింత పుంజుకుంటుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. మరో రెండేళ్లలో ఇక్కడ మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
This post was last modified on October 25, 2024 10:05 am
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…