ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు కీలకమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్ పర్సన్‌గా ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించింది. సాధారణంగా.. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకాలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రస్తుతం జరిగిన నియామకానికి ప్రాధాన్యం ఉంది. దీంతో ఇది వార్తగా మారింది. ఏపీపీఎస్సీకి.. తొలిసారి మహిళను చైర్ పర్సన్‌గా నియమించారు. దీనికితోడు ఇటీవలే ఆమె పదవి విరమణ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలోనూ చంద్రబాబు హయాంలో అనేక పోస్టులు చేసిన అనురాధ.. మాజీ ఐపీఎస్ నిమ్మగడ్డ సురేంద్ర బాబు సతీమణి కావడం గమనార్హం. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా అనురాధ పనిచేశారు. ఆ తర్వాత ఆక్టోపస్‌కు మారారు.
విద్యుత్ ఉద్యమం జరిగిన 2002-03 మధ్య అనురాధ కమిషనర్‌గా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం.. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అయితే.. గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాద ఘటనను ముందుగానే అంచనా వేయలేకపోవడంతో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది.
దీంతో వెంటనే అనురాధను హోం శాఖ కార్యదర్శిగా మార్పు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఇక, జగన్ హయాంలోనూ అనురాధ కీలక పాత్ర పోషించారు. ఇటీవల చంద్రబాబు పగ్గాలు చేపట్టాక జూలైలో ఆమె రిటైరయ్యారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఆమెకు ఏపీపీఎస్సీ చైర్ పర్సన్ పదవిని ఇవ్వడం గమనార్హం. కాగా.. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతం సవాంగ్ వ్యవహరించారు. అప్పట్లో ఆయన డీజీపీగా ఉన్నారు. ఆయనను మార్పు చేస్తూ.. కడపకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీ పగ్గాలు అందించారు.
ఈ క్రమంలోనే గౌతం సవాంగ్‌కు ఏపీపీఎస్సీ పగ్గాలు అప్పగించారు. ఇక, చంద్రబాబు కూటమి అధికారం చేపట్టాక సవాంగ్ తనంతట తనే ఈ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఏకంగా ఆయన ఐపీఎస్‌కే రాజీనామా చేయడం మరో విషయం. వృత్తి నిబద్ధతకు పెట్టింది పేరైన అనురాధ.. ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులు కావడం గమనార్హం.
This post was last modified on October 23, 2024 9:12 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…