Political News

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను కేంద్రం ఇస్తుండ‌గా..(దీనిని తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు) మిగిలిన 13600 కోట్ల‌ను అప్పుగా ఇప్పించ‌నుంది.

ఇది విడ‌త‌ల వారీగా రాష్ట్ర స‌ర్కారుకు చేర‌నుంది. ఈ ఏడాది డిసెంబ‌రులో 130 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప్ర‌పంచ బ్యాంకు డాల‌ర్ల రూపంలో రుణం అందించ‌నుంది. ఇక‌, అక్క‌డి నుంచి ప‌నుల పురోగ‌తిని చూసి.. మిగిలిన మొత్తాల‌ను కూడా వాయిదాల రూపంలో ఇవ్వ‌నుంది. ఇది నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు బూస్టుగా మార‌నుంది. ఇదిలావుంటే.. మ‌రోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా రూ.15000 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను అమ‌రావ‌తికి అందించ‌నుంది. ఇది నేరుగా రాష్ట్రానికి సంబంధించిన వ్య‌వ‌హారం. అంటే.. ఏడీబీ-ఏపీ ప్ర‌భుత్వం రెండూ స‌మ‌న్వ‌యంతో ఈ రుణంపై ప్ర‌తిపాద‌న‌లు, ఒప్పందాలు చేసుకుంటాయి.

దీనివ‌ల్ల మ‌రో 15 వేల కోట్ల రూపాయ‌ల రుణం అంద‌నుంది. ఇప్ప‌టికి రూ.30 వేల కోట్ల వ‌ర‌కు రుణం అందిన‌ట్టు అయింది. ఇవి కూడా విడ‌ద‌ల వారీగా రాజ‌ధానికి బూస్ట్‌గా మార‌నున్నాయి. ఇక‌, ఇప్పుడు మరో 11 వేల కోట్ల రూపాయ‌ల‌ను హ‌డ్కో ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది. ఇవి నేరుగా సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత అభివృద్ది ప్రాదికారిక సంస్థ‌) ఖాతాకు హ‌డ్కో జ‌మ చేయ‌నుంది. ఈ నిధుల‌తో ర‌హ‌దారుల నిర్మాణం, ప‌చ్చ‌ద‌నం ప్రోత్సాహ‌క ప‌నులు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే.. రాజ‌ధాని ఎలానూ గ్రీన్ ఫీల్డ్ సిటీనే కాబ‌ట్టి.. ఈ నిధుల‌ను కూడా రాజ‌ధాని నిర్మాణంలోనే ఖ‌ర్చు చేయ‌నున్నారు.

సో.. ఇలా.. రాష్ట్ర సర్కారు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఏదైనా సాధ్యం అవుతుంద‌నేది చంద్ర‌బాబు నిరూపించారు. ఇక‌, క‌థ ఇక్క‌డితో కూడా అయిపోలేదు. రాజ‌ధానికి సంబంధించిన బాండ్ల‌ను షేర్ మార్కెట్‌లో విక్ర‌యించ‌డం ద్వారా.. ఏడాదికి రూ.3 వేల కోట్ల రూపాయ‌ల‌ను తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. ఇదికూడా మైలురాయిగా మార‌నుంది. ఇప్ప‌టికి ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. రాజ‌ధాని నిర్మాణానికి ఇప్ప‌టికిప్పుడు 20 వేల కోట్ల రూపాయ‌లు కావాలి. అనంత‌రం.. ఇక్క‌డ జ‌రిగే నిర్మాణాల ఆధారంగా రాజ‌ధాని సొంత‌గానే నిధులు స‌మ‌కూర్చుకునే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి.. ఇక‌, రాజ‌ధాని నిర్మాణాలు ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

This post was last modified on October 23, 2024 10:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

6 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

6 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

7 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

9 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

10 hours ago