Political News

మాజీ ఎంపీ నందిగంపై ఎటెంప్టివ్ మ‌ర్డ‌ర్‌ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌..ఇప్ప‌ట్లో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. టీడీపీ ఆఫీసుపై 2021లో జ‌రిగిన దాడి నేప‌థ్యంలో న‌మోదైన కేసులో ఆయ‌న తొలుత అరెస్టు అయ్యారు. 14 రోజుల పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. బెయిల్ వ‌చ్చింది. కానీ, ఇంత‌లోనే.. అమ‌రావ‌తిలోని వెంక‌ట పాలెంలో ఉన్న ఎస్సీ కాల‌నీలో మ‌రియ‌మ్మ అనే మ‌హిళ హ‌త్య కేసులో ఈయ‌న పాత్ర ఉంద‌ని తేల్చారు.

దీంతో నందిగంపై మ‌రియ‌మ్మ హ‌త్య కేసు న‌మోదై.. ఆ వెంట‌నే మ‌రో 14 రోజుల పాటు ఈ కేసులో రిమాండ్ విధించారు. ఫ‌లితంగా నందిగం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టకురాలేదు. పైగా రెండు రోజుల పోలీసు క‌స్టడీ లో విచార‌ణ‌కు కూడా హాజ‌రయ్యారు. ఇక‌, మ‌రియ‌మ్మ కేసులో బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యం లో తాజాగా మ‌రో సంచ‌ల‌న కేసు న‌మోదైంది. అదే.. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌పై 2021-22 మధ్య జ‌రిగిన హత్యా య‌త్నం.

దీనిని ఇప్పుడు బీజేపీ నాయ‌కులు తిర‌గ‌దోడారు. ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో స‌త్య‌కుమార్ యాద‌వ్ ప‌ర్య‌టించిన స‌మ‌యంలో ఆయ‌న‌పై ఓ వ్య‌క్తి హ‌త్యాయ‌త్నం చేశార‌న్న‌ది.. బీజేపీ నేత‌లు చేసిన ఫిర్యాదు. దీని వెనుక మాస్ట‌ర్ మైండ్ అంతా.. నందిగం సురేష్‌దేన‌ని ఆరోపిస్తున్నారు. దీనిపై గుంటూరు పోలీసుల కు బీజేపీ నాయ‌కులు కొన్నాళ్ల కింద‌టే ఫిర్యాదు చేయ‌గా.. అంత‌ర్గ‌త విచార‌ణలో దీనిపై నందిగం పాత్ర ను పోలీసులు కూపీలాగిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో బీజేపీ నేత స‌త్య‌కుమార్‌పై హ‌త్యాయ‌త్నం కేసు వెనుక నందిగం పాత్ర ఉంద‌ని నిర్ధారించు కున్నారు. దీంతో ఆయ‌న పై కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది. ఫ‌లితంగా నందిగం.. మ‌రో కేసులో ఇరు క్కున్న‌ట్టు అయింది. దీనిపై అధికారికంగా పోలీసులు ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. మ‌రోవైపు.. గ‌తంలో టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పై దాడి చేసిన కేసులోనూ నందిగంపై రెండు రోజుల కింద‌ట కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే.

This post was last modified on October 22, 2024 6:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……

5 hours ago

భన్సాలీతో బన్నీ – ఏం జరుగుతోంది ?

సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…

11 hours ago

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా..…

12 hours ago

తిరుప‌తి తొక్కిస‌లాట‌: జ‌గ‌న్ కామెంట్స్ ఇవే!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌కు భ‌య‌ప‌డుతోంద‌ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు భ‌య‌ప‌డుతున్న…

13 hours ago

ఒకే చోట ప‌వ‌న్‌-జ‌గ‌న్ ఎదురు పడ్డ వేళ‌!

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లు…

13 hours ago

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…

13 hours ago