ఏపీ ప్రతిపక్షం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా కాదు.. మూకుమ్మడిగానే ఆ పార్టీని వదిలేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయ భాను వంటి ఆది నుంచి వైసీపీతో కలిసి నడిచిన నాయకులు పార్టీ మారిపోయారు. ఇక, మధ్యలో వచ్చి.. మధ్యలోనే వెళ్లిపోయిన నాయకులకు లెక్కేలేదు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది.
ఇక, ఇప్పుడు నలుగురు ఉద్ధండ నాయకులు కూడా.. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టు పక్కాగా తెలుస్తోంది. వీరంతా సామాజిక వర్గాల పరంగా.. స్థానికంగా కూడా బలమైన నాయకులు కావడం గమనార్హం. అంతేకాదు.. ప్రజా క్షేత్రంలోనూ పలు విజయాలు అందుకుని.. పదవులు కూడా అనుభవించి న వారే కావడం మరింత ఆసక్తిగా మారింది. వీరిలో తొలి పేరు ధర్మాన ప్రసాదరావు. 2) ముద్రగడ పద్మనాభం. 3) ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 4) గడికోట శ్రీకాంత్ రెడ్డి. వీరంతా త్వరలోనే వైసీపీకి రాం రాం చెప్పనున్నట్టు సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది.
1) ధర్మాన ప్రసాదరావు : వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న ధర్మాన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడిని వైసీపీలో చేర్చేందుకు ప్రయత్నించినా.. స్థానికంగా జనసేన వైపు ధర్మాన కుమారుడు మొగ్గు చూపుతున్నారు. దీంతో ధర్మాన రాజకీయాల నుంచితప్పుకొని తన కుమారుడిని జనసేనలోకి పంపిస్తారని చర్చ సాగుతోంది.
2) ముద్రగడ పద్మనాభం: కాపు ఉద్యమంతో హైలెట్ అయిన.. కేంద్ర మాజీ మంత్రి కూడా. ఎన్నికలకు ముందు వైసీపీ పంచన చేరారు. జనసేన అధినేత పవన్‌ను పిఠాపురంలో ఓడిస్తానని శపథం చేశారు. ఓడించకపోతే.. పేరు మార్చుకుంటానని చెప్పి.. రెడ్డిగా మార్చుకున్నారు. ఇప్పుడు ఈయన కూడా రాజకీయాలకు పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్నట్టు అనుచరులు చెబుతున్నారు.
3) ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు: వైసీపీలో ఆది నుంచి ఉన్నారు. ఈయన అల్లుడే కిలారు రోశయ్య. గతంలో పొన్నూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. అయితే.. ఓడిపోయారు. ఆ తర్వాత.. ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామాలతో ఉమ్మారెడ్డిపై వైసీపీ నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఇక, వృద్ధాప్యం కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఉమ్మారెడ్డి అసలు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇటీవల అసలు ఆఫీసుకు కూడా రావడం మానేశారు.
4) గడికోట శ్రీకాంత్‌రెడ్డి: కడప జిల్లా రాయచోటి మాజీ ఎమ్మెల్యే. జగన్‌తో కలిసి నడిచి.. కలిసి తిరిగిన తొలి నాయకుడు కూడా.. ఈయనే. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీప రుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో గడికోట ఓడిపోయారు. కానీ, పార్టీ పరంగా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందన్న ఆవేదన ఆయనలో ఉంది. మంత్రి పదవిని ఆశించినా ఇవ్వలేదు. ముందు చీఫ్ విప్ ఇచ్చి.. తర్వాత తీసేశారు. ఈ పరిణామాలతో ఇక, రాజకీయాలు చాలన్నది ఆయన భావన. ఇలా.. ఈ నలుగురు.. నాలుగు ప్రాంతాల్లో వైసీపీకి ఇప్పటి వరకు కొమ్ము కాశారు. కానీ, ఇప్పుడు మాత్రం దూరం అవుతున్నారు. ఇది వైసీపీకి భారీ షాకే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 20, 2024 12:54 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…