వైసీపీ అధినేత జగన్.. తాజాగా నిర్వహించిన ఆ పార్టీ నేతల వర్క్ షాపులో నేతలకు, కార్యకర్తలకు.. ఆరు మాసాల టార్గెట్ పెట్టారు. “ఆరు మాసాల్లో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మీదే” అంటూ నొక్కి చెప్పారు. అందరూ ఒకే తాటిపై నిలిచి.. పార్టీని ముందుకు నడిపించాలని కూడా ఆయన ఆదేశించారు. అంతేకాదు.. ఎక్కడైనా చిన్నపాటి విభేదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించే బాధ్యత సీనియర్లు తీసుకోవాలని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కూడా సూచించారు.
అయితే.. ఇది చెప్పడానికి బాగానే ఉంది. కానీ, పోతున్న నాయకులు పోతూనే ఉన్నారు. తాజాగా నిర్వహించిన వర్క్ షాపునకు కూడా రెండు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు రాలేదు. ఈ విషయాన్ని జగన్ ఆరా తీయకపోయినా.. మీడియా ఆరా తీస్తోంది. వారు పక్క చూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతోనే వారు జగన్ పిలిచినా కీలక సమావేశానికి హాజరు కాలేదు. ఇక, మరికొందరు తమ వ్యాపారాలు, వ్యవహారాల కోసం.. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారు.
ఈ విషయం కూడా జగన్‌కు బాగానే తెలుసు. అయినా.. ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక, మరికొందరు నాయకులు.. జగన్ వైఖరితో విసుగు చెంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు తాము ఎంత చెప్పినా వినకుండా నియోజకవర్గాలు మార్చారన్న ఆవేదన నేతల్లో ఉంది. ఈ కారణంగా కొందరు నాయకులు పార్టీతో అంటీ ముట్టనట్టే ఉన్నారు. సో.. ఇలాంటి వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత, బుజ్జగించాల్సిన అవసరం జగన్‌పైనే ఉంది.
ఇక, మరీ ముఖ్యంగా గతంలో పదవులు పొంది, మంత్రులుగా పనిచేసిన వారు కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని లైన్‌లో పెట్టి పార్టీ కోసం పనిచేయించుకోవడం జగన్‌పైనే ఉన్న కీలక బాధ్యత. వీటిని విస్మరించిన జగన్.. ఆరుమాసాల గడువు పెట్టి పార్టీ పుంజుకునేలా చేయాలని కార్యకర్తలకు, నేతలకు చెప్పి చేతులు దులుపు కొంటే పార్టీ పుంజుకుంటుందా? అనేది కీలక ప్రశ్న. ఏదేమైనా.. జగన్ మారలేదు.. అన్నమాట మరో సారి నిజం చేసుకున్నారు.
This post was last modified on October 18, 2024 9:48 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…