Political News

నేనేమీ అందాల భామ‌ల కోసం ప‌నిచేయ‌ట్లేదు: రేవంత్‌

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ కామెంట్లు చేశారు. మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అంశంపై ఆయ‌న మాట్లాడుతూ… ఇది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాను చేప‌ట్టిన బృహ‌త్ సంక‌ల్పంగా పేర్కొన్నారు. నేనేమీ అందాల మేడ‌లు క‌ట్టుకునేందుకు, దోచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. నేనేమీ అందాల భామ‌ల కోసం ప‌నిచేయ‌డం లేదు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టేందుకు ప‌నిచేస్తున్నా అని వ్యాఖ్యానించారు.

మూసీ ప్ర‌క్షాళ‌న కోసం.. ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌న్న బీఆర్ఎస్ నాయ‌కుల విమ‌ర్శ‌ల‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న కోసం 141 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని.. దీనికి సంబంధించిన అన్ని వివ‌రాలు అధికారికంగానే ఉన్నాయ‌ని చెప్పారు. ఎక్క‌డా ఎవ‌రినీ మోసం చేయ‌డం లేద‌న్నారు. మూసీ న‌దిని బాగు చేస్తే.. త‌న‌కేమీ కోట్లు రావ‌ని.. త‌న‌కేమీ ఆర్థిక ప్ర‌యోజ‌నం కూడా జ‌ర‌గ‌ద‌ని చెప్పారు. కానీ, మూసీ న‌దిని బాగు చేస్తే.. హైద‌రాబాద్‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల సంఖ్య పెరుగుతుంద‌న్నారు.

దీనివ‌ల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంద‌ని, ఫ‌లితంగా సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసి ప్ర‌జ‌ల‌కు పంచేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మూసీ సుంద‌రిక‌ర‌ణ అనేది ప్రాజెక్టు కాద‌న్నారు. “ఇది కేవ‌లం ప్రక్షాళ‌నే” అని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు. “మూసిన‌ది కాలుష్యం కార‌ణంగా హైద‌రాబాద్‌తో పాటు న‌ల్ల‌గొండ ప్ర‌జ‌లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నాం” అని రేవంత్‌రెడ్డి చెప్పారు. కానీ, త‌న‌ను ఓ దోపిడీ దొంగ విమ‌ర్శిస్తున్నార‌ని ప‌రోక్షంగా కేటీఆర్‌పై విరుచుకుప‌డ్డారు.

అన్నీ పార‌ద‌ర్శ‌కంగానే

మూసీ ప్ర‌క్షాళ‌న ప‌నులు పార‌దర్శ‌కంగానే చేప‌డుతున్న‌ట్టు సీఎం రేవంత్‌రెడ్డి వివ‌రించారు. హైద‌రాబాద్‌లోని ముచ్చింత‌ల్‌లో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని నిర్మించిన మెయిన్‌హార్డ్స్ సంస్థ‌కే తాము మూసి న‌ది ప్ర‌క్షాళ‌న కాంట్రాక్టును అప్ప‌గిస్తున్న‌ట్టు తెలిపారు. అప్పుడు గొప్ప‌గా ఉన్న సంస్థ‌.. ఇప్పుడు పాడైపోయిందా? అని బీఆర్ఎస్ నాయ‌కుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. అంద‌రూ వ‌ద్దంటే తాను మాత్రం ఏమీ చేయ‌లేన‌ని, కాంట్రాక్టును ర‌ద్దు చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

This post was last modified on October 17, 2024 10:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇన్ని దెయ్యాల సినిమాలు ఎందుకు బుజ్జి

అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…

3 minutes ago

రోజు నాన్ వెజ్ తినడం వల్ల ఎన్ని సమస్యలో తెలుసా?

ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…

35 minutes ago

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

9 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

9 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

9 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

11 hours ago