ఔను! ఇది ముమ్మాటికీ నిజం. గత 2014-19 మధ్య చంద్రబాబు పాలన ప్రారంభించిన తర్వాత.. ఎలాంటి వార్తలు వచ్చాయో..ఇప్పుడు కూడా అలాంటివే వస్తున్నాయి. ఇక్కడేమీ కల్పిత వార్తలు వచ్చాయని చెప్ప డం లేదు. ఓపిక ఉంటే.. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే.. అప్పటి వర్తాలకు.. ఇప్పుడు గత నాలుగు రోజులుగా వస్తున్నవార్తలకు మధ్య చాలా సారూప్యత ఉంది. ఏమాత్రం పెద్దగా తేడా లేదు. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
అతి చేస్తున్నారు!…. ఇవి మచ్చుకు కొన్ని హెడ్డింగులు మాత్రమే. అవి కూడా రెండు ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల కింద పెట్టుకున్న హెడ్డింగులే. ఇవన్నీ.. 2014-18 మధ్య వచ్చిన ప్రధాన వార్తలు. కట్ చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు కూడా పూర్తి కాకముందే.. దాదాపు కాపీ పేస్ట్ అన్నట్టుగా ప్రధాన పత్రికలు ఇవే హెడ్డింగులతో వార్తలు రాస్తున్నాయి. అయితే.. ఆయా పత్రికలకు సర్కారుపై కక్షేమీ లేదు. కానీ, జరుగుతున్నది వాస్తవం కాబట్టి!!
అయితే.. అప్పటికి ఇప్పటికీ.. తేడా ఒక్కటే.. నాడు కనీసం ఏడాదిపాటైనా తమ్ముళ్లు వేచి చూశారు. కానీ, ఇప్పుడు మాత్రం వచ్చీ రావడంతోనే రెచ్చిపోతున్నారు. చెలరేగిపోతున్నారు. మరి ఈ పరిణామాలను చంద్రబాబు అడ్డుకుంటారా? లేక.. తమ్ముళ్లకు నొప్పితెలియని విధంగా గిచ్చి వదిలేస్తారా? అనేది చూడాలి. ఇంతకీ కీలక పాయింట్ ఏంటంటే.. కొన్ని కొన్ని తప్పులు ఎంత అనుకూల మీడియా సర్దుబాటు చేయాలన్నా.. చివరి నిముషంలో చేతులు ఎత్తేయకతప్పదు! కాబట్టి ముందే జాగ్రత్త పడితే బెటర్!!
This post was last modified on October 18, 2024 9:31 am
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…