Political News

రాజుల కోట‌లో కాపు మంత్రాంగం.. సీతారామ‌ల‌క్ష్మి వ్యూహాలు సాగేనా?

తాజాగా రాష్ట్ర టీడీపీలో చేసిన ప్ర‌యోగంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. టీడీపీ దెబ్బ‌తిన్న తీరు చూస్తే.. గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో పార్టీ ఇలా ఇబ్బంది ప‌డిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. ఈ నేప‌థ్యంలోనే పార్టీకి అత్య‌వ‌స‌రంగా కాయ‌క‌ల్ప చికిత్స అవ‌స‌రమ‌ని అంద‌రు నేత‌లు అభిప్రాయ‌పడ్డారు.

ప్ర‌జ‌ల్లో పార్టీ ఓడిపోవ‌డం ఒక్క‌టే కాదు.. పార్టీలోనూ నైరాశ్యం ఏర్ప‌డింది. దీనిని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తేనే త‌ప్ప‌.. పార్టీ ప‌రుగులు పెట్టే అవ‌కాశం లేదు. దీనిని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. పార్టీలో కీల‌క‌మైన పార్ల‌మెంట‌రీ జిల్లా చీఫ్‌ల‌ను నియ‌మించారు.

మొత్తం ఇర‌వై ఐదుమంది కీల‌క నాయ‌కుల‌కు 25 నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే ఈ కూర్పులోనూ చాలా చోట్ల పొర‌పాట్లు దొర్లాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం నియోజ‌క‌వర్గానికి జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా తోట సీతారామ‌లక్ష్మిని నియ‌మించారు. ఈ కూర్పు స‌రికాద‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎందుకంటే.. న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి కంచుకోట‌. ఇక్క‌డ ఏపార్టీ అయినా.. క్ష‌త్రియ వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది.

కాద‌ని.. వేరే వ‌ర్గానికి టికెట్ ఇచ్చినా.. బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌డం లేదని త‌మ్ముళ్లు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా క్ష‌త్రియ వ‌ర్గానికి టికెట్ ఇచ్చింద‌ని, టీడీపీ కూడా క‌లువపూడి శివ వంటి క్ష‌త్రియ వ‌ర్గానికి టికెట్ ఇవ్వ‌డం మంచిదైంద‌ని.. కానీ, ఇప్పుడు ఈ వ‌ర్గాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టి కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సీతారామ‌ల‌క్ష్మిని తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే.. ఆమెకు, పార్టీకి కూడా క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు.

ఆమె సీనియ‌ర్ రాజ‌కీయ‌నాకురాలే అయిన‌ప్ప‌టికీ.. రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా చేసిన అనుభ‌వం ఉన్న‌ప్ప‌టికీ.. న‌ర‌సాపురం వంటి కీల‌క‌మైన క్ష‌త్రియ వ‌ర్గం డామినేష‌న్ ఉన్న చోట్ల ఆమెకు ప‌గ్గాలు అప్ప‌గించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. సీతారామ‌ల‌క్ష్మి కూడా ఇస్తే.. త‌న‌కు కాకినాడ ఇవ్వాల‌ని.. లేదంటే.. ఏమీ వ‌ద్ద‌ని చెప్ప‌డం! కానీ, బాబు వ్యూహం ఏంటో చూడాలి.

This post was last modified on October 1, 2020 12:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

32 minutes ago

విడుదల పార్ట్ 3 క్లారిటీ ఇచ్చేశారు!

విజయ్ సేతుపతి, దర్శకుడు వెట్రిమారన్ కలయికలో రూపొందిన విడుదల పార్ట్ 2 ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. మొదటి భాగం…

2 hours ago

ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు‌. అయితే, రద్దీ కారణంగా…

3 hours ago

కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట!

ఫ్ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.…

3 hours ago