Movie Reviews

భారతీయుడు 2 సమీక్ష : విసిగించిన తాతయ్య

28 సంవత్సరాల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కు కొనసాగింపనే ఆలోచన చేయడమే సాహసం. అందులోనూ కమల్ హాసన్ లాంటి సీనియర్ మోస్ట్ హీరోతో ఈ ప్రయోగానికి సిద్ధపడటం చాలా రిస్క్. దాని వల్లే భారతీయుడు 2 ప్రకటన వచ్చినప్పటి నుంచే జనంలో ఆసక్తి పెంచింది. మధ్యలో క్రేన్ ప్రమాదం వల్ల నెలల తరబడి బ్రేక్ వేసుకుని గేమ్ ఛేంజర్ తో పాటు సమాంతరంగా షూటింగ్ జరుపుకున్న ఈ భారీ చిత్రానికి శంకర్ దర్శకత్వం ఆడియన్స్ అంచనాలను పెంచింది. మరి దానికి తగ్గట్టు తాతయ్య మెప్పించాడో లేదో చూద్దాం

కథ

సోషల్ మీడియాలో బార్కింగ్ డాగ్స్ పేరుతో స్నేహితులతో కలిసి ఛానల్ నడిపే చిత్ర అరవిందన్ (సిద్దార్థ్) కు సమాజంలో అవినీతి వల్ల జరుగుతున్న దారుణాలు మనస్థాపం కలిగిస్తాయి. దీంతో సేనాపతి (కమల్ హాసన్) తిరిగి రావాలని ట్రెండింగ్ పిలుపు ఇస్తే మిలియన్లలో స్పందన వస్తుంది. దీంతో ఎక్కడో విదేశంలో ఉన్న భారతీయుడికి ఇది తెలిసి వెనక్కు వచ్చేందుకు నిర్ణయించుకుంటాడు. తన పాత పద్ధతిలో తప్పు చేసిన వాళ్లను కత్తితో హత్య చేయకుండా మర్మకళ ద్వారా విచిత్రమైన శిక్షలకు గురి చేస్తాడు. క్రమంగా సేనాపతి పనులు అనూహ్య మలుపులు తిరిగి జనం ఛీదరించే పరిస్థితి వస్తుంది. వందేళ్ల పైనే వయసున్న తాతయ్య ఏం చేశాడనేది తెరమీద చూడాలి.

విశ్లేషణ

సామజిక సమస్యలకు కమర్షియల్ కోటింగ్ ఇచ్చి, కోట్ల రూపాయల భారీ ఖర్చుని తెరమీద చూపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడంలో దర్శకుడు శంకర్ ది ప్రత్యేకమైన శైలి. కేవలం గ్రాండియర్ల వల్ల ఆయనకు గొప్ప పేరు రాలేదు. హీరో క్యారెక్టరైజేషన్ మొదలుకుని ప్రతి పాత్రకు ఎమోషన్ డిజైన్ చేసే దాకా ప్రతి విషయంలో తీసుకునే శ్రద్ధ పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. జెంటిల్ మెన్ నుంచి రోబో దాకా ఇదే ధోరణి గమనించవచ్చు. 1996లో రిలీజైన భారతీయుడు చూసినప్పుడు ప్రేక్షకులు షాక్ తిన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ప్రభుత్వం నుంచి తామర పాత్రం తీసుకునే ఒక వృద్ధుడు లంచం మీద చేసిన యుద్ధం చూసి అబ్బురపడి సూపర్ హిట్ చేశారు.

భారతీయుడు 2ని అదే రేంజులో ఆడియన్స్ ఊహించుకోవడం తప్పేం కాదు. సినిమా ప్రారంభమైన అరగంట వరకు సిద్ధార్థ్ చుట్టూ నడిపించిన శంకర్ అంతసేపు ఎన్నో సినిమాల్లో చూసేసి అరిగిపోయిన సొసైటీ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ రిజిస్టర్ చేసే ప్రయత్నం దగ్గరి నుంచే స్క్రీన్ ప్లే ఇబ్బంది మొదలైంది. సేనాపతి తిరిగి రావడానికి బలమైన ఎపిసోడ్ పడాలి. కానీ విలన్ డెన్ లో ఫారిన్ అమ్మాయిల అర్ధ నగ్న డాన్సుల క్యాలెండర్ సాంగ్ పెట్టడం దగ్గరి నుంచే శంకర్ తన మార్కుని మిస్ చేయడం కనిపిస్తుంది. పోనీ అంత బిల్డప్ ఇచ్చిన సేనాపతి ఇంట్రో వావ్ అనిపించే స్థాయిలో అదిరిపోయేలా ఉందా అంటే ఫ్యాన్స్ తో సహా అందరికి సోసోగానే అనిపిస్తుంది.

సేనాపతికి బలమైన నేపథ్యం ఉందని మొదటి భాగంలో చూశాం. అతను తిరిగి వస్తున్నప్పుడు దాని తాలూకు ఎమోషన్ ని చూసే జనం మెదళ్లలో తీవ్రంగా రిజిస్టర్ చేయాలి. దానికి బదులు సిద్దార్థ్ గ్యాంగ్ ర్యాప్ సాంగ్ పాడుకుంటూ డాన్సులు చేయడం ఎంత మాత్రం అతకలేదు సరికదా ఉన్న మైనసుల్లో మొదటి స్థానంలో నిలిచింది. భారతీయుడు ఫోకస్ చేసేది ఎంత లంచం మీదే అయినా దాని మీద మితిమీరి ఆధారపడటం నప్పలేదు. ఈ పాతికేళ్లలో లంచం మాసిపోలేదు కానీ జనం ఆ మహమ్మారికి అలవాటు పడిపోయి దాన్నో మాములు విషయంగా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అనూహ్యంగా అనిపించే సంఘటలను ఏమైనా రాసుకుని ఉంటే బాగుండేది.

ఇంటర్వెల్ దాకా ఏదోలా నెట్టుకుంటూ వచ్చినా అసలు ముప్పు సెకండ్ హాఫ్ లో మొదలయ్యింది. ఖచ్చితంగా ఇండియన్ 3 కావాలనే ఉద్దేశంతో అవసరానికి మించిన సన్నివేశాల ల్యాగ్ తో సహనానికి పెద్ద పరీక్ష పెడతాడు శంకర్. సిద్దార్థ్ తల్లి చనిపోవడమే రొటీన్ డ్రామా అనుకుంటే ఆ చావు చుట్టూ పావు గంటకు పైగా అక్కర్లేని నాటకీయతను ఇరికించడంతో అసలు కథనం ఎటు పోతుందో అర్థం కాదు. పోనీ సిద్దార్థ్ తాలూకు భావోద్వేగం ఫీలయ్యేలా సెంటిమెంట్ జొప్పించారా అంటే అదీ లేదు. దాని వల్ల ఇదంతా భరించలేని ప్రహసనంగా మారిపోతుంది. పైగా సిద్దార్థ్ నడిపించే బార్కింగ్ డాగ్స్ కుటుంబాల్లో ఉన్న లంచగొండుల చుట్టూ రిపీట్ సీన్స్ నడిపించడం వీర ల్యాగ్ కు పరాకాష్ట.

నిజానికి రెండు భాగాలను ఒకే కథగా మార్చి మొత్తం భారతీయుడు 2లోనే చూపించి ఉంటే బాగుండేది. కానీ అసలు స్టోరీ భారతీయుడు 3లో చెప్పాలనే ఉద్దేశంతో వెబ్ సిరీస్ తరహాలో కథనం రాసుకోవడం డ్యామేజ్ పెంచింది. సీక్వెల్స్ మత్తులో పడి బిజినెస్ కోసం సాగదీయడం కన్నా ఆర్ఆర్ఆర్ లాగా ఒక్క భాగం తీసినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవొచ్చని జక్కన్న నిరూపించాడు. కానీ శంకర్ ఈ వాస్తవాన్ని గుర్తించకపోవడం దురదృష్టం. థర్డ్ పార్ట్ లో అసలైన కంటెంట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కలిగించిన నిరాశ దానికి శరాఘాతంగా మారే ప్రమాదం లేకపోలేదు. మధ్యాహ్నం బాలేనిది తింటే రాత్రికి రుచికరమైనది వండుతా అంటే హోటల్ కస్టమర్ ఒప్పుకుంటాడా. ఇదీ అంతే.

శంకర్ లాంటి అద్భుతమైన టెక్నీషియన్ సైతం ప్రేక్షకులను టెకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్న వైనం చాలా చోట్ల కనిపిస్తుంది. తన ఫార్ములానే ఫాలో అవుతూ ఎందరో దర్శకులు ఇలాంటి లైన్ మీద చాలా సినిమాలు తీసి దాన్ని అవుట్ డేటెడ్ గా మార్చారని గుర్తించకుండా తిరిగి అదే టెంప్లేట్ సన్నివేశాలు పేర్చుకుంటూ పోవడం వీరాభిమానులకు జీర్ణం కాదు. ఫిలిం మేకింగ్ లో రాజమౌళి అంతటివారికే స్ఫూర్తినిచ్చిన ఈ మాస్టర్ డైరెక్టర్ తనలో పనితనం ఇంతగా ఇంకిపోయిందా అని బాధ పడేలా అనిపిస్తూనే ఉంటాడు. గతంలో విక్రమ్ ఐ లాంటివి నిరాశపరిచినా వాటిలో సాంకేతిక విలువలు విమర్శకుల మెప్పు పొందాయి. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు.

నటీనటులు

యాక్టింగ్ డిక్షనరి కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఇంత వయసులోనూ అదే కమిట్ మెంట్ చూపిస్తున్న తపనకు సెల్యూట్ చేయడం తప్ప. సిద్దార్థ్ తనకిచ్చిన క్యారెక్టర్ కు నప్పాడు. ప్రియా భవాని శంకర్ ఫ్రెండ్స్ గుంపులో ఎక్కువసేపు కనిపించినా ఎలాంటి ప్రభావం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ కు చెప్పుకోవడానికి ఒక బరువైన సీన్ పడింది. అంతే. ఎస్జె సూర్యని అక్కడక్కడా చూపించారు తప్పించి వాడుకోలేదు. బాబీ సింహ, సముతిరఖనిలకు చెప్పుకోదగ్గ స్పేస్ ఇచ్చారు. ఇద్దరూ న్యాయం చేశారు. నిజ జీవితంలో చనిపోయిన నడిముడి వేణు, ఢిల్లీ గణేష్, మనోబలం, వివేక్ లను చూపించడం బాగుంది. నిడివి కూడా బాగానే దొరికింది.

సాంకేతిక వర్గం

రెహమాన్ ని మరిపించలేననే ఒత్తిడో లేక ఫైనల్ కట్ చూశాక ఇంతకన్నా ఇవ్వలేననే నిర్లిప్తతతో తెలియదు కానీ అనిరుద్ రవిచందర్ సంగీతం పరంగా ఎలాంటి న్యాయం చేయలేదు. వీక్ సీన్స్ ని సైతం బీజీఎమ్ తో నిలబెట్టే ఇతని పనితనం ఇందులో కట్టేసి వాయించినట్టు ఉంది. ఉన్నంతలో భారతీయుడు 1 సిగ్నేచర్ ట్యూన్ వాడుకోవడమే బాగుంది. రవి వర్మన్ ఛాయాగ్రహణం అనుభవాన్ని రంగరించి ఉన్నంతలో మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో కోత వేయడానికి బోలెడు స్కోప్ ఉన్నా మొహమాటపడటంతో ల్యాగ్ వచ్చింది. బాగా ఖర్చు పెట్టిన లైకా నిర్మాణ విలువల గురించి నెగటివ్ కామెంట్స్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు.

ప్లస్ పాయింట్స్

కమల్ హాసన్ అంకితభావం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

కొత్తదనం లేని కథ
సంగీతం
సెకండాఫ్
అతకని ఎమోషన్

ఫినిషింగ్ టచ్ : విసిగించిన తాతయ్య

రేటింగ్ : 2 / 5

This post was last modified on July 12, 2024 1:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని…

5 minutes ago

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…

9 minutes ago

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

1 hour ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

2 hours ago

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ డిమాండ్ చూశారా

మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…

3 hours ago

ట్రెండుని పట్టేసుకున్న బెల్లంకొండ ‘హైందవ’

అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…

4 hours ago